మోటకొండూరు గుంతల రోడ్లకు మోక్షం ఎప్పుడు...?

యాదాద్రి భువనగిరి జిల్లా: మోట కొండూరు మండలంలో పలు రహదారులు శిధిలావస్థకు చేరుకొని, గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యంగా తయారయ్యాయని,రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే ఎక్కడ ఏ గుంత ఉందో అర్ధంకాక వాహనాలు ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయని మండల ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.ప్రభుత్వాలు,పాలకులు మారినా ఈ మండలంలో రహదారుల తలరాతలు మాత్రం మారడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Govt Officials Neglecting Motokondur Pothole Roads, Govt Officials ,motokondur P-TeluguStop.com

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని రోడ్లు బాగు చేయాలని బిఎస్పీ యాదాద్రి జిల్లా ఇన్చార్జి గంధమల్ల లింగస్వామి డిమాండ్ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రధాన రోడ్లన్నీ గుంతలమయమై అద్వాన్నంగా మారాయని,

ప్రయాణికులు,వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని,జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేపట్టి, అవసరమున్న చోట కొత్త రోడ్లను వేయాలని కోరారు.

దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉందని,జిల్లా నలుమూలల నుండి తమ సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణించడం వల్ల వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.జిల్లాలోని ప్రతి మండలంలో రోడ్ల సమస్య ఇలాగే ఉందని, ఇలాంటి పండుగల సమయాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించోద్దన్నారు.

వెంటనే ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణలో పాడైపోయిన రోడ్లను గుర్తించి మరమ్మత్తులు చేయాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube