మోటకొండూరు గుంతల రోడ్లకు మోక్షం ఎప్పుడు…?

యాదాద్రి భువనగిరి జిల్లా: మోట కొండూరు మండలంలో పలు రహదారులు శిధిలావస్థకు చేరుకొని, గుంతలు పడి ప్రయాణానికి అసౌకర్యంగా తయారయ్యాయని,రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే ఎక్కడ ఏ గుంత ఉందో అర్ధంకాక వాహనాలు ప్రమాదానికి గురైన సంఘటనలు ఉన్నాయని మండల ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.

ప్రభుత్వాలు,పాలకులు మారినా ఈ మండలంలో రహదారుల తలరాతలు మాత్రం మారడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని రోడ్లు బాగు చేయాలని బిఎస్పీ యాదాద్రి జిల్లా ఇన్చార్జి గంధమల్ల లింగస్వామి డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రధాన రోడ్లన్నీ గుంతలమయమై అద్వాన్నంగా మారాయని, ప్రయాణికులు,వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని,జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని వెంటనే రోడ్ల మరమ్మత్తులు చేపట్టి, అవసరమున్న చోట కొత్త రోడ్లను వేయాలని కోరారు.

దసరా పండుగ నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉందని,జిల్లా నలుమూలల నుండి తమ సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణించడం వల్ల వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

జిల్లాలోని ప్రతి మండలంలో రోడ్ల సమస్య ఇలాగే ఉందని, ఇలాంటి పండుగల సమయాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించోద్దన్నారు.

వెంటనే ఆర్ అండ్ బి అధికారుల పర్యవేక్షణలో పాడైపోయిన రోడ్లను గుర్తించి మరమ్మత్తులు చేయాలన్నారు.

త్వరలోనే ప్రభాస్ పెళ్లి.. దుర్గమ్మ సన్నిధిలో ప్రభాస్ పెద్దమ్మ కామెంట్!