టాలీవుడ్ లో చాలా రోజులుగా నెంబర్ వన్ పొజిషన్ హీరోయిన్స్ విషయంలో ఖాళీగానే ఉంది మనం చాలా రోజులుగా ఆస్థానం ఎవరు అందుకుంటారు అని ఎదురుచూస్తూ ఉన్నారు.ఫ్యామిలీ స్టార్ సినిమా విజయం సాధిస్తే ఖచ్చితంగా మనాల్ ఠాగూర్ నెంబర్ వన్ స్థాయికి వెళుతుంది అని అందరూ ఊహించారు.
కానీ ఈ సినిమా పరాజయం పొందడంతో మళ్ళీ ఆ సీట్ ఎవరికోసం ఎదురు చూస్తుంది అనే చర్చ మొదలయ్యింది. శ్రీలీల( Sreeleela ) కాళీ చేసిన ఆ పొజిషన్ కోసం చాలామంది కర్చీఫ్ వేశారు కానీ ఎవరికి ఆ స్థానం అయితే దక్కడం లేదు.
మరి ఇకపై ఆ స్థానంలో కూర్చోవడానికి తహతహలాడుతున్న మిగతా హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిన్న మొన్నటి వరకు మృణల్ ఠాకూర్( Mrunal Thakur ) కచ్చితంగా ఫ్యామిలీ స్టార్ సినిమా విజయం సాధిస్తే ఆమెకు మరింత క్రేజీ పెరుగుతుంది.ఆమె నెంబర్ వన్ హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు.కానీ ఇకపై ఆ ఆశలు గల్లంతయ్యాయి.
దాంతో అందరి దృష్టి ఇప్పుడు మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) వైపు మళ్ళింది.వరుణ్ తేజ్ తో ఒక ప్రాజెక్ట్, దుల్కర్ సల్మాన్ తో ఒక ప్రాజెక్ట్స్ చేస్తుంది.
అలాగే తమిళ్ లో విజయ్ తో కూడా సినిమాకి కమిట్ అయింది దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు.ఇక జాన్వి కపూర్ దేవర సినిమా విడుదలయితే తప్ప ఆమె స్థాయి ఏంటో ఇక్కడ వరకు అర్థం కాదు.
ఆమె తెలుగులో దేవర సినిమాతో పాటు మరో చిత్రంలో కూడా నటించడానికి రంగం సిద్ధమైంది.
ఇక నాది తెలుగు కాదు బాలీవుడ్ అంటుంది రష్మిక మందన( Rashmika mandanna ).నేను టాలీవుడ్ ఎప్పుడో వదిలేసాను అంటుంది పూజ హెగ్డే.ప్రియాంక మోహన్( Priyanka Moha ) లాంటి హీరోయిన్స్ అప్పుడప్పుడు వస్తు మళ్ళీ వెళ్ళిపోతున్నారు.
ఇంకా కొత్త హీరోయిన్స్ ఒకటి లేదా రెండు సినిమాలకే కమిట్ ఉన్నారు కాబట్టి వారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు అప్పుడే నెంబర్ వన్ స్థాయికి వచ్చే అవకాశాలు లేవు.ఏ వైపు చూసుకున్న నెంబర్ వన్ పొజిషన్ కోసం ఏ హీరోయిన్ కూడా పోటీలో లేదు.
మరి ఈ దాదాపు మరో ఆరు నెలల పాటు ఈ సీట్ ఖచ్చితంగా కాళీ గానే ఉంటుంది.