ఢిల్లీ వేదికగా రేపు కాంగ్రెస్( Congress ) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.ఇందులో భాగంగా తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలపై కసరత్తు కొనసాగుతోంది.
ఇప్పటికే రెండు దఫాల్లో తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే మిగిలిన ఎనిమిది స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది.
కాగా సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల కేటాయింపు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో మొత్తం 8 స్థానాల్లో ఐదు స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.దీంతో మిగిలిన మరో మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.అయితే ఖమ్మం, నిజామాబాద్( Nizamabad) మరియు భువనగిరి స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారని తెలుస్తోంది.
రేపటి లోగా అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.