Ireland PM Leo Varadkar : ఐర్లాండ్ ప్రధాని పదవికి భారత సంతతి నేత లియో వరద్కర్ రాజీనామా

భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్( Ireland PM Leo Varadkar ) బుధవారం అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు.వ్యక్తిగత , రాజకీయ కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లియో ప్రకటించి దుమారం రేపారు.

 Indian Origin Leo Varadkar To Step Down As Irelands Prime Minister-TeluguStop.com

వచ్చే ఏడాది జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో( General Elections ) ఫైన్‌గేల్ పార్టీకి( Fine Gael Party ) సీట్లు సాధించేందుకు సమర్ధుడైన నాయకుడు వస్తారని ఆకాంక్షిస్తున్నట్లు లియో వరద్కర్ పేర్కొన్నారు.ఏడేళ్ల పాటు పదవిలో వున్న తర్వాత.

ఈ ఉద్యోగానికి తానే అత్యుత్తమ వ్యక్తినని భావించడం లేదన్నారు.స్థానిక యూరోపియన్ ఎన్నికలలో నమ్మకమైన సహచరులు, స్నేహితులు పోటీ చేస్తున్నారని తాను వారికి సాధ్యమైనంత ఉత్తమమైన అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని వరద్కర్ చెప్పారు.

రాజకీయ నాయకులమైనా మేము మనుషులమేనని మాకు పరిమితులు వున్నాయని ఆయన పేర్కొన్నారు.తనకు ఖచ్చితమైన , వ్యక్తిగత , రాజకీయ ప్రణాళికలు లేవని.

వాటి గురించి ఆలోచించడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నానని వరద్కర్ చెప్పారు.

-Telugu NRI

లియో వరద్కర్ ముంబైకి చెందిన తండ్రికి ఐరిష్ తల్లికి ఐర్లాండ్‌లో జన్మించారు.2017 నుంచి ఫైన్‌గేల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.38 ఏళ్ల వయసులో ఆయన దేశంలోనే అతి పిన్న వయస్కుడైన, అలాగే స్వలింగ సంపర్కుడైన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రికార్డుల్లోకెక్కారు.రెండు సార్లు టావోసీచ్‌గానూ విధులు నిర్వర్తించారు.పిల్లల హక్కులు, ఎల్‌జీబీటీ సంఘం( LGBT Community ), మహిళలకు సమానత్వం, శారీరక స్వయం ప్రతిపత్తి విషయానికి వస్తే ఐర్లాండ్ అద్భుతమైన ప్రదేశమని .ఇందుకు తాను గర్విస్తున్నానని వరద్కర్ చెప్పారు.

-Telugu NRI

గత నెలలో యూకేలో భాగమైన ఉత్తర ఐర్లాండ్‌తో సరిహద్దును పంచుకునేలా యూకే ప్రధాని రిషి సునాక్( UK PM Rishi Sunak ), వరద్కర్ మధ్య చారిత్రాత్మక అధికార భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.వరద్కర్ ఐర్లాండ్‌కు నాయకత్వం వహించిన తొలి సమయం 2017 నుంచి 2020 వరకు కొనసాగింది.2020 నుంచి డిసెంబర్ 2022 వరకు తానైస్టే లేదా ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఫియానాతో మూడు పార్టీల సంకీర్ణాన్ని బలపరిచే రొటేటింగ్ టావోసీచ్( Rotating Taoiseach ) ఒప్పందంలో ఉన్నారు.తన డబ్లిన్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాలని యోచిస్తున్నట్లు వరద్కర్ చెప్పారు.ఐర్లాండ్ ఎన్నికలు( Ireland Elections ) షెడ్యూల్ ప్రకారం మార్చి 2025 నాటికి జరగాలి.

ఇంతలో ఆ దేశ రాజకీయ పార్టీలు జూన్‌లో స్థానిక ప్రభుత్వం, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube