త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) ప్రచారానికి రంగం సిద్ధం చేస్తుంది.ఈ మేరకు మహబూబ్ నగర్( Mahbub Nagar ) నుంచి పాలమూరు ప్రజాదీవెన సభను నిర్వహించనుంది.
కాగా ఈ సభా వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.అదేవిధంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే పాలమూరు ప్రజాదీవెన సభ కోసం సీఎం రేవంత్ రెడ్డిని వంశీచంద్ రెడ్డి ఆహ్వానించారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది.