మన దేశంలోని ఎంతోమంది సివిల్స్( Civils ) లక్ష్యాన్ని సాధించాలని కలలు కంటారు.అయితే కొంతమంది సులువుగానే సివిల్స్ క్రాక్ చేసినా ఎక్కువమంది మాత్రం ఆ లక్ష్యాన్ని సాధించలేక వెనుకడుగు వేయడం లేదా మరో రంగంపై దృష్టి పెట్టడం చేస్తున్నారు.
అయితే విదూషి సింగ్( Vidhushi Singh ) అనే యువతి మాత్రం 2022లో జరిగిన సివిల్స్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 13వ ర్యాంక్ సాధించారు.
అయితే విదూషి సింగ్ సక్సెస్ కు అయోధ్య రాముడు ( Rama of Ayodhya )కూడా పరోక్షంగా కారణం కావడం గమనార్హం.
అయోధ్యలో విదూషి సింగ్ కుటుంబ మూలాలు ఉండగా ఇంటర్వ్యూలో ఆమెకు అయోధ్యకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి.ఆ ప్రశ్నలకు సులువుగా తన తెలివితేటలతో సమాధానాలు ఇక్ఛిన విదూషి సింగ్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.
21 సంవత్సరాల వయస్సులోనే సివిల్స్ క్రాక్ చేసిన విదూషి సింగ్ అయోధ్య వల్ల, అయోధ్య రాముని వల్ల తన కల నెరవేరిందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయోధ్య నగరం, అయోధ్య చారిత్రక నేపథ్యం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం తనకు ఎంతగానో ప్లస్ అయిందని విదూషి సింగ్ కామెంట్లు చేశారు.విదూషి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
సివిల్స్ క్రాక్ చేయడం సులువు కాదని అయితే సివిల్స్ క్రాక్ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని విదూషి సింగ్ వెల్లడించారు.విదూషి సింగ్ సివిల్స్ లో 1039 మార్కులు సాధించడం గమనార్హం.ప్రస్తుతం ఆమె ఐ.ఎఫ్.ఎస్ ఆఫీసర్ గా పని చేస్తూ సత్తా చాటుతున్నారు.