చాలా సందర్భాల్లో స్పందించడం కంటే సైలెంట్ గా ఉండటమే మంచి ఫలితాలను ఇస్తుందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సైతం తనపై వచ్చే కామెంట్ల గురించి, విమర్శల గురించి, తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి సైలెంట్ గా ఉంటున్నారు.
ఏదైనా ఈవెంట్ లో ప్రశ్నలు ఎదురవుతున్నా ఆ ఈవెంట్ కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలని తారక్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior ntr ) ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడం కంటే సైలెంట్ గా ఉండటమే బెటర్ అని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు.
వరుసగా ఆరు విజయాలు తారక్ స్టేటస్ ను మార్చేశాయి.వరుస సక్సెస్ ల వల్ల తారక్ సక్సెస్ రేట్ సైతం పెరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై దృష్టి పెడితే ఆయన వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, పవన్, జగన్ మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి.వీళ్ల మధ్య గట్టి పోటీ ఉంది.తమిళనాడు రాష్ట్రంలో విజయ్( Vijay ) ఎంట్రీ ఇచ్చిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా సరైన సమయం చూసి రాజకీయాల్లోకి అడుగులు వేయడమే ఆయన కెరీర్ కు ఎంతో మేలు చేస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఒకప్పుడు వేగంగా నటించిన తారక్ ప్రస్తుతం ఒకింత నిదానంగా సినిమాలు చేస్తున్నారు.తారక్ సినిమాలకు సంబంధించి మరింత వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.తారక్ రెమ్యునరేషన్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో 5 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఆయన జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు చెబుతున్నారు.
తారక్ మాత్రం కెరీర్ పరంగా తప్పటడుగులు వేయకుండా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.