తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చిట్ చాట్ లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ మేరకు జ్యుడీషియల్ విచారణలో అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
13వ తేదీన వారికి సమావేశం ఉంటే ప్రాజెక్టు సందర్శనకు మరో తేదీని ఖరారు చేస్తామన్నారు.ఎప్పుడైనా బీఆర్ఎస్ ( BRS )నేతలను ప్రాజెక్టు వద్దకు తీసుకుని వెళ్లేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.అదేవిధంగా త్వరలోనే రైతులకు రుణమాఫీ ఉంటుందని ఆయన వెల్లడించారు.ఇందుకోసం బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.