15 సంవత్సరాల తర్వాత రాబోతున్న శేఖర్ కమ్ముల లీడర్ సీక్వెల్!

ప్రస్తుతం కాలంలో ఒక సినిమా ఎంతో మంచి సక్సెస్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ సినిమా వస్తుంది.ఇలా ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలన్నింటికీ కూడా సీక్వెల్ సినిమాలు ఉన్నాయి.

 Sekhar Kammula To Do Leader Sequel Movie, Sekhar Kammula, Leader Sequel, Rana, T-TeluguStop.com

అయితే దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది.దర్శకుడు శేఖర్ కమ్ముల ( Sekhar Kammula ) దర్శకత్వంలో రానా ( Rana ) హీరోగా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి చిత్రం లీడర్.

పొలిటికల్ కుళ్ళుని ప్రశ్నిస్తూనే సమాజంలో పాతుకుపోయిన మంత్రుల అవినీతిని చూపించిన తీరు శభాష్ అనిపించుకుంది.

Telugu Danush, Sequel, Nagarjuna, Rana, Sekhar Kammula, Tollywood-Movie

ఇలా రాజకీయాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం రాబోతుందని తెలుస్తోంది.ఎప్పటి నుంచో లీడర్ సీక్వెల్ ( Leader Sequel )కావాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.

దానికి అనుగుణంగానే శేఖర్ కమ్ముల కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారట.ప్రస్తుతం ఈయన నాగార్జున ( Nagarjuna ) ధనుష్ ( Danush )తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Telugu Danush, Sequel, Nagarjuna, Rana, Sekhar Kammula, Tollywood-Movie

ప్రస్తుతం ఏషియన్ బ్యానర్లో శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నారు.అయితే ఇదే ఏషియన్ బ్యానర్ కు మూడో కమిట్మెంట్ కూడా ఇచ్చారని తెలుస్తుంది.ఇదే విషయాన్ని నిన్న అధికారకంగా ప్రకటించారు.దీంతో ఈ సినిమా సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది.మరి ఈ సినిమాలో నటీనటులు ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.రాష్ట్ర విభజన జరిగాక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చిన దృష్ట్యా వాటిని లీడర్ 2 లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

నాగార్జున ధనుష్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా తెరపైకి రాబోతుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube