టాలీవుడ్ నటి, ఒకప్పటి హీరోయిన్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకోవడంతో పాటు, తనకు తన పిల్లలకు సంబంధించిన గాసిప్స్ వినిపించిన వెంటనే వాటిని స్పందిస్తూ ఉంటుంది.తనపై నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి బుద్ధి చెబుతూ ఉంటుంది రేణు దేశాయ్.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈమె ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది.కాగా తాజాగా మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది రేణు దేశాయ్.
తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే.
ప్రస్తుతం కేరళ వెకేషన్‌లో ఉన్న ఆమె అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
మరో వైపు అకీరా,( Akira ) ఆద్యలు( Aadya ) మెగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో పియానో వాయించి అందరినీ మెస్మరైజ్ చేశాడు అకీరా నందన్. త్వరలోనూ అతను హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఆద్య కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.ఈ నేపథ్యంలో తన పిల్లలు ఎదుగుతున్న తీరును చూసి మురిసిపోతోంది రేణూ దేశాయ్.
వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా? లేదంటే వాళ్లు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి పునర్జన్మనిచ్చారా? అన్నది అర్థం కావడం లేదు. నా పిల్లలను చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను అని పోస్ట్‌లో చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పిల్లలను చాలా బాగా పెంచుతున్నారు మేడమ్.మీరు నిజంగా చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.