వైసీపీ ఇన్చార్జిల మార్పు మూడో జాబితా విడుదల చేయడం జరిగింది.మొత్తం 21 మంది పేర్లను ప్రకటించడం జరిగింది.
ఇందులో 6 లోక్ సభ, 15 అసెంబ్లీ నియోజ కవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలను ప్రకటించారు.ఈ జాబితాలో కేశినేని నాని( Kesineni Nani )ని విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా నియమించారు.దీంతో వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కి ట్విట్టర్ ద్వారా కేశినేని నాని కృతజ్ఞతలు తెలియజేశారు.
“మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను” అంటూ సీఎం జగన్( CM YS Jagan ) ని ఉద్దేశించి ట్వీట్ చేయడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో రెండుసార్లు విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలవడం జరిగింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా రాణించారు.
అయితే గత కొంతకాలం నుండి పార్టీ అధినాయకత్వంతో విభేదాలు రావడంతో ఇటీవల కేశినేని నాని తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.నిన్ననే వైయస్ జగన్ ని కలవడం కూడా జరిగింది.
ఈ క్రమంలో నేడు ఆయన పేరును విజయవాడ లోక్ సభ ఇన్చార్జిగా వైసీపీ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.