టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ).తాజాగా రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) హీరోగా నటించిన యానిమల్ సినిమా( Animal Movie ) ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే.
సందీప్ రెడ్డి( Sandeep Reddy ) వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించినటువంటి ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు( Mahesh Babu ) మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలను పెంచేసాయి.
![Telugu Animal, Krishna, Mahesh Babu, Ranbir Kapoor, Tollywood-Movie Telugu Animal, Krishna, Mahesh Babu, Ranbir Kapoor, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/mahesh-babu-Ranbir-Kapoor-Animal-Movie-Namrata-Shirodkar-krishna-anger-moments.jpg)
ఇక ఈ వేడుకలో భాగంగా మహేష్ బాబు తన మాటలతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇకపోతే రిపోర్టర్స్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు మహేష్ బాబు ఆసక్తికరమైనటువంటి సమాధానం ఇచ్చారు.మీ తండ్రి కృష్ణగారు ఎప్పుడైనా మీపై కోపడినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటూ ఈయనకు ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు మహేష్ బాబు( Mahesh Babu ) సమాధానం చెబుతూ అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని అయితే ఈ సినిమాలో చూపించిన విధంగా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే నేను చూడలేదు అంటూ మహేష్ బాబు తెలిపారు.
![Telugu Animal, Krishna, Mahesh Babu, Ranbir Kapoor, Tollywood-Movie Telugu Animal, Krishna, Mahesh Babu, Ranbir Kapoor, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/mahesh-babu-Ranbir-Kapoor-tollywood-Animal-Movie-Namrata-Shirodkar-krishna.jpg)
ఇక మరొక మీడియా ప్రతినిధి మహేష్ బాబును ప్రశ్నిస్తూ భార్యను మేనేజ్ చేయడానికి మీరు ఏవైనా కొన్ని టిప్స్ చెప్పండి అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. భార్యలను మేనేజ్ చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని భర్తలు ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలని తెలిపారు.సందర్భం ఏదైనా నవ్వుతూ ఉండండి వారిని మేనేజ్ చేయడానికి అదొక్కటే దారి అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు.
దీంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా షాక్ అవుతూ బహుశా మహేష్ బాబు నమ్రతను( Namrata Shirodkar ) కూడా అలాగే మేనేజ్ చేస్తున్నారేమో అంటూ ఈయన వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు.