ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ మేరకు వెయ్యి బైకులతో చేపట్టిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పువ్వాడ ఆరోపించారు.తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు.
ఓడిపోతామనే ఫ్రస్టేషన్ లో ప్రత్యర్థులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.అయితే ఖమ్మం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.