భువనగిరిలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిందేంటని ప్రశ్నించారు.
భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని ప్రియాంక గాంధీ సూచించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు.
ప్రజా సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వానికి అవగాహన లేదన్న ఆమె తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు.పరీక్షా పేపర్లను లీక్ చేసి యువత భవిష్యత్ తో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని వెల్లడించారు.