సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ( Congress party )ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దారురి యోగానందచారి మాట్లాడుతూ తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడొద్దని,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
తుంగతుర్తి నుండి పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ గెలుపు కొరకు ప్రతీ ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం,ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ,నజీర్ గౌడ్,తిమ్మాపురం పిఏసీఎస్ మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకటరెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.