‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి ‘ లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య( Balayya ) నుండి వచ్చిన ‘భగవంత్ కేసరి’ ( Bhagwant Kesari )చిత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి, ఆయన కెరీర్ లో చాలా కాలం తర్వాత ఒక హ్యాట్రిక్ తగిలింది.కుటుంబ ఎమోషన్స్ నేపద్ద్యం లో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.తమిళం నుండి భారీ అంచనాల నడుమ దబ్ అయ్యి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న ‘లియో’ చిత్రం మేనియా ని కూడా తట్టుకొని ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అంటే, బాలయ్య స్టామినా ఎలాంటిదో, ప్రస్తుతం ఆయన ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.‘దసరా’ కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకుంది, ఈ రెండు వారాల్లో ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
![Telugu Balayya, Bhagwant Kesari, Audience, Kajal, Sreleela, Tollywood-Movie Telugu Balayya, Bhagwant Kesari, Audience, Kajal, Sreleela, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Bhagwant-Kesari-2-weeks-collections-how-much-more-to-break-eveng.jpg)
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి దసరా సెలవులు వరకు అద్భుతమైన వసూళ్లు వాహకాయని , కానీ ఆ తర్వాత నుండి మాత్రం చాలా యావరేజి రేంజ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వసూళ్లు బాగా డౌన్ అయిపోయాయి అట.సోమవారం నాడు ఈ చిత్రానికి 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, మంగళవారామ్ నాడు 45 లక్షలు, అలాగే బుధవారం నాడు 30 లక్షల రూపాయిలు వచ్చాయని అంటున్నారు.ప్రతీ రోజు ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతున్నప్పటికీ, నూన్ మరియు మ్యాట్నీ షోస్ చాలా డల్ గా ఉంటున్నాయి.
కానీ ఈ వారం పెద్దగా సినిమాలేవీ లేదు కాబట్టి, ఈ వీకెండ్ మరోసారి ఈ చిత్రం మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
![Telugu Balayya, Bhagwant Kesari, Audience, Kajal, Sreleela, Tollywood-Movie Telugu Balayya, Bhagwant Kesari, Audience, Kajal, Sreleela, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/Bhagwant-Kesari-2-weeks-collections-how-much-more-to-break-evenh.jpg)
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి రెండు వారాలకు కలిపి దాదాపుగా 62 కోట్ల రూపాయిల షేర్ వసూలు వచ్చాయని, అఖండ మరియు వీర సింహా రెడ్డి చిత్రాల తర్వాత బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం ఇదే అని అంటున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 67 నుండి 68 కోట్ల రూపాయలకు జరిగింది.క్లీన్ హిట్ స్టేటస్ రావాలంటే మరో 6 కోట్ల రూపాయిల షేర్ కచ్చితంగా రావాల్సిందే.
మరి ఈ వీకెండ్ హోల్డ్ ని బట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి.