భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీ( ODI World Cup )లో పాల్గొనే 10 జట్లు మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న తరువాత ఐసీసీ నిర్వహించిన పోటీలో వరల్డ్ కప్ 2023 బెస్ట్ ఫీల్డర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు.విరాట్ కోహ్లీ( Virat Kohli ) 22.30 రేటింగ్ పాయింట్ తో వన్డే వరల్డ్ కప్ బెస్ట్ ఫీల్డర్ గా అగ్రస్థానంలో ఉన్నాడు.తరువాత స్థానాలలో జో రూట్ 21.73, డేవిడ్ వార్నర్ 21.73, కాన్వే 15.54, షాదాబ్ ఖాన్ 15.13, మ్యాక్స్ వెల్ 15, రహమత్ షా 13.77, సాంట్నర్ 13.28 రేటింగ్ పాయింట్లతో ఉన్నారు.
నేడు భారత్- బంగ్లాదేశ్ మధ్య పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.హ్యాట్రిక్ విజయాలను సాధించిన భారత్ నేటి మ్యాచ్లో బంగ్లాదేశ్ పై పైచేయి సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది.అందు కోసమే జట్టులో కూడా కొన్ని కీలక మార్పులు చేసింది.భారత జట్టు టోర్నీ ప్రారంభం నుండి ఆశించిన స్థాయిలో మంచి అద్భుత ఆటనే ప్రదర్శిస్తోంది.బంగ్లాదేశ్ జట్టు ఈరోజు జరిగే మ్యాచ్లో ఎలాగైనా భారత్ పై గెలవాలని కాస్త ఆత్రుతగా ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే భారత జట్టు రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.నేడు జరిగే బంగ్లాదేశ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు.ప్రస్తుతం భారత జట్టులో ప్రతి ఆటగాడు మంచి ఫామ్ లోనే ఉన్నాడు.ఇలాంటి పరిస్థితులలో బంగ్లాదేశ్( Bangladesh ) ఆటగాళ్లు, భారత ఆటగాళ్లను నిలువరించడం ఒక విధంగా అసాధ్యమే.
ఈ మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడల్సి ఉంది.