ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానున్న టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ట్రైలర్ కొత్తగా ఉండటంతో పాటు మాస్ మహారాజ్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలో నుపుర్ సనన్( Nupur Sanon ) హీరోయిన్ గా నటించారు.కృతి సనన్ చెల్లెలు అయిన ఈ బ్యూటీ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
2005 సంవత్సరంలో యూట్యూబర్ గా నా కెరీర్ మొదలైందని నేను సినిమాల్లోని పాటలను నా శైలిలో పాడేదానినని ఆమె తెలిపారు.నేను ఫిల్హాల్( Filhall ) అనే ప్రైవేట్ ఆల్బమ్ లో నటించగా ఈ ఆల్బమ్ వేగంగా 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న తొలి వీడియో అని నుపుర్ సనన్ చెప్పుకొచ్చారు.సింగింగ్ అడిషన్ కోసం వెళ్తే యాక్టింగ్ ఛాన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.అయితే కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా ఆగిపోయిందని నుపుర్ సనన్ చెప్పుకొచ్చారు.
కృతిసనన్ నాకు అమ్మ మాత్రమే కాదని అక్క కూడా అని ఆమె తెలిపారు.నాకు ఏం కావాలో కృతికి బాగా తెలుసని నుపుర్ సనన్ పేర్కొన్నారు.
చిన్నప్పుడు నన్ను ఎవరైనా టీజ్ చేస్తే వాళ్లను అక్క చితకబాదేదని నుపుర్ సనన్ అన్నారు.కాలేజ్ రోజుల్లో ఒక అబ్బాయిని లవ్ చేశానని ఆ అబ్బాయి మోసం చేయడంతో ఏడ్చేశానని ఆమె అన్నారు.
ఆ తర్వాత ఎవరినీ సులువుగా నమ్మకూడదని ఫిక్స్ అయ్యానని నుపుర్ సనన్ తెలిపారు.
నాకు వంట చేయడం నచ్చదని లాక్ డౌన్ సమయంలో గరిటె తిప్పడం నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మెక్సికన్ ఫుడ్( Mexican Food ) ను ఎంతో ఇష్టపడతానని ఆమె తెలిపారు.బ్లాక్ కాఫీ లేనిదే నాకు రోజు మొదలవ్వదని ఆమె కామెంట్లు చేశారు.
నుపుర్ సనన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.