బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డ్ సృష్టించిన తెలుగు బిగ్ బాస్ 7... ఎప్పుడు ఇలా జరగలేదుగా?

బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ (Bigg Boss) రియాలిటీ షో ఒకటి అని చెప్పాలి.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

 Bigg Boss Telugu Season 7 Rare Record In Bigg Boss History Details, Bigg Boss 7t-TeluguStop.com

ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది.ఇక ఏడవ సీజన్ నేటితో ఆరు వారాలను పూర్తిచేసుకుంది.

ఇకపోతే ఈ వారం కూడా హౌస్ నుంచి మరొక లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్ళబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ సెవెన్(Bigg Boss 7) కార్యక్రమం ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు.

అయితే వీరిలో ఐదుగురు కంటెస్టెంట్లు ఇప్పటికే ఎలిమినేట్ కాగా మరో ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీ( Wildcard Entry ) ద్వారా హౌస్ లోకి పంపించారు.ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా ఏడుగురు కంటెస్టెంట్ లో ఉన్నారు.

అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈ వారం కూడా హౌస్ నుంచి మరొక లేడీ కంటెస్టెంట్ నయని పావని(Nayani Pavani) ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది.

Telugu Bigg Boss Lady, Bigg Boss, Damini, Lady, Nagarjuna, Nayani Pavani, Rathik

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ఒక్క వారానికే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇక ఇదివరకు ఏ సీజన్లో కూడా జరగనట్టు బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇలా తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఇప్పటివరకు ఆరుగురు లేడీ కంటెస్టెంట్లను( Lady Contestants ) మాత్రమే బయటకు పంపించడం జరిగింది.ఇదివరకు ఏ భాషలోనూ ఏ సీజన్లోనూ జరగని విధంగా తెలుగులో ఏకంగా ఆరుగురు లేడీ కంటెస్టెంట్లను పంపించడంతో పలువురు ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకుల పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.

Telugu Bigg Boss Lady, Bigg Boss, Damini, Lady, Nagarjuna, Nayani Pavani, Rathik

బిగ్ బాస్ వోట్లతో కాకుండా వారికి నచ్చిన వారిని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారని, ఈ క్రమంలోనే ఈ సీజన్లో మొత్తం లేడీ కంటెస్టెంట్ ల పైనే ఫోకస్ పెట్టారని,అందుకే వారిని ఒక్కొక్కరిని బయటకు పంపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.నిజానికి ఈవారం శోభ శెట్టి(Sobha Shetty) ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఆమెను సేవ్ చేయడం కోసమే నయని పావనిను బయటకు పంపిస్తున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఏది ఏమైనా ఒకేసారి ఆరుగురు లేడి కంటెస్టెంట్లను బయటకు పంపించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube