మహిళా సాధికారత కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.కొత్త పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన ఆయన లోక్ సభ ఎదుటకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే లోక్ సభ, అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ కోసం నారీశక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
ఉభయసభల సభ్యులు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.నారీశక్తి వందన్ పేరుతో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
కాగా ఈ బిల్లు ద్వారా ఇక చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను కల్పించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.