మధుమేహానికి వేపతో పరిష్కారం!

ప్రపంచం లో ఎక్కువ మంది బాధపడుతున్న వ్యాధి డయాబెటిస్. దాదాపుగా 422 మిలియన్ మంది ఈ వ్యాధి తో బాధపడుతుంటే, ఏడాదికి 1.6 మిలియన్ మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు.తాజాగా పరిశోధకులు డయాబెటిస్ కి వేప విరుగుడు గా పనిచేస్తుంది అని కనుగొన్నారు.

 Neem Leaves Best Solution For Diabetes Details, Neem, Diabetes, Health Tips, Nee-TeluguStop.com

భారతీయ వైద్య విధానం లో వేపను విరివిగా వాడుతారు.వేపను ఇలా తీసుకుంటే డయాబెటిస్ కు పక్కాగా పని చేస్తోంది అని వైద్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

వేపలో ఉండే ఔషధాలు శరీరం లో గ్లూకోస్ శాతం పెరగకుండా కంట్రోల్ చేస్తాయి.ప్రతి రోజు ఉదయం వేప ఆకులను తింటే డయాబెటిస్ కు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు, ఇలా ఆకులను తినలేని వాళ్ళు వేడి నీళ్లలో ఉడికించుకొని ఆ రసాన్ని రోజు రెండు పూటలు తాగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని.

ఈ పరిశోధన వల్ల డయాబెటిస్ వ్యాధి తో బాధపడుతున్న చాలా మందికి కొంత ఊరట లభించినట్లయింది.

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి రికవరీ రేట్ మనదేశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ కరోనా ప్రభావం డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారి పై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సరిగ్గా ఇలాంటి టైంలో ఇలాంటి వార్త బయటకు రావడం శుభసూచకమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

Telugu Corona, Diabetes, Tips, Neem, Neemcontrol, Neem Benefits, Neem Tree, Suga

కరోనా మెడిసన్ కనుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు కానీ గత దశాబ్ద కాలంగా మానవాళిని వెంటాడుతున్న వ్యాధులకు మాత్రం కొన్ని ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నాయి.కరోనా మెడిసన్ కనుగొనే లోపు ఇంకెన్ని ప్రత్యామ్నాయాలు దొరుకుతాయో వేచి చూడాలి.ఇక మీకు తెలిసి డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారితో ఈ చిట్కాను షేర్ చేయండి డయాబెటిస్ వ్యాధి కంట్రోల్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేయకుండా ప్రకృతిక పద్ధతులు ఉపయోగించి ఈ సమస్య నుండి ఉపశమనం పొందండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube