బైక్‌పై వెళ్తున్నప్పుడు రైడర్ మాత్రమే కాకుండా ప్యాసింజర్ కూడా హెల్మెట్( Helmet ) ధరించాల్సి ఉంటుంది.అయితే ఈ రూల్ చాలామంది పెద్దగా పాటించడం లేదు.
ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల కిందపడితే హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది.ఖాళీ ప్రాణాల కంటే సౌకర్యానికే చాలామంది మొగ్గు చూపుతూ అవి లేకుండానే ప్రయాణాలు చేస్తున్నారు.
అయితే తాజాగా బైక్ పై( Bike ) ప్రయాణిస్తూ ఇద్దరూ హెల్మెట్ ధరించి కనిపించారు.అయితే బైక్ వెనక కూర్చున్న యువతి హెల్మెట్ ఎలా ధరించాలో తెలియక దాన్ని రివర్స్‌లో తగిలించుకుంది.
దానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.ఈ ఇమేజ్‌ల్లో వెనుక మహిళతో ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌ను నడుపుతున్నట్లు కనిపించింది.మోటారు సైకిల్ బస్సు వెనుక ఆగి ఉండటం మీరు గమనించవచ్చు.సదరు మహిళ హెల్మెట్ రివర్స్‌లో ధరించడం ( Helmet Reverse ) కూడా గమనించవచ్చు.దీనిని గమనించిన ఇతర వాహనదారులు తెగ నవ్వుకున్నారు.కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో( Social Media ) షేర్ కూడా చేశారు.
బైక్‌పై వెళ్లే ప్రయాణికులు రివర్స్‌లో హెల్మెట్ ధరించినట్లయితే, ప్రమాదం జరిగినప్పుడు అది తగిన రక్షణను అందించదు.
హెల్మెట్ విజర్ తప్పు మార్గంలో ఉంటుంది.హెల్మెట్ తలకి సరిగ్గా సేఫ్టీ అందించదు.రివర్స్‌లో హెల్మెట్ ధరించడం అసౌకర్యంగా ఉంటుంది.
హెల్మెట్ మీ తల నుండి సులభంగా జారిపోతుంది.అలాంటి సమయంలో అది ధరించినా పెద్దగా ప్రయోజనం ఉండక తలకు తీవ్ర గాయాలు అవుతాయి.
బైక్‌పై ప్రయాణించే వారైతే, హెల్మెట్ తప్పని సరిగా ధరించడం ముఖ్యం.హెల్మెట్ బియర్డ్ పట్టీని సురక్షితంగా బిగించాలి.
హెల్మెట్ ఎలా ధరించాలో తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి.