బాలీవుడ్ కాంట్రవర్సీసీ క్వీన్ కంగనా రౌనత్ ( Kangana Raunat ) తాజాగా నటించిన చిత్రం చంద్రముఖి 2( Chandramukhi 2 ),2004వ సంవత్సరంలో పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్( Rajinikath ) జ్యోతిక నయనతార వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చంద్రముఖి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సీక్వెల్ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించినప్పటికీ రజినీకాంత్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు.ఇక చంద్రముఖి సినిమాలో చంద్రముఖి పాత్రలో జ్యోతిక ఎంతో ఒదిగిపోయినటించారు.

ఇక సీక్వెల్ సినిమాలో మాత్రం జ్యోతిక( Jyothika ) ఈ పాత్రలో నటించలేదు ఈ పాత్రలో బాలీవుడ్ నటి కంగనా నటించారు.ఇక ఈ సినిమా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సెప్టెంబర్ 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్( Chandramukhi 2 Trailer ) విడుదల చేయగా ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇకపోతే ఈ సినిమాలోని చంద్రముఖి పాత్రలో నటించిన కంగనా నటన పట్ల మాజీ చంద్రముఖి జ్యోతిక స్పందిస్తూ ఆమె నటనపై ప్రశంసల కురిపించారు.ఈ సందర్భంగా జ్యోతిక సోషల్ మీడియా వేదికగా చంద్రముఖి పాత్రలో కంగనా నటించడం గురించి మాట్లాడుతూ చంద్రముఖి పాత్ర( Chandramukhi Role )లో కంగనా ఎంతో అద్భుతంగా నటించిందని తెలిపారు.తన నటనకు నేను అభిమానిగా మారిపోయానని జ్యోతిక వెల్లడించారు.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కంగనా ఈ పాత్రలో నటించడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేశారు.
సినిమా కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఈమె తెలియజేయడమే కాకుండా డైరెక్టర్ వాసు గారికి అలాగే రాఘవ లారెన్స్ మాస్టర్( Raghava Lawrence ) కు బెస్ట్ విషెస్ అంటూ ఈమె చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.