ఆసియా కప్ 2023( Asia Cup 2023 ) టోర్నీలో సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియం( Gaddafi Stadium in Lahore ) వేదికగా జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇంకా ఈ టోర్నీ లో సూపర్-4 లో మిగిలిన ఐదు మ్యాచ్‌లు శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనున్నాయి.అయితే వచ్చే 10-12 రోజులపాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఋతుపవనాల ఆలస్యం వలన గత రెండు వారాలుగా కొలంబోలో వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.సూపర్-4 మ్యాచ్‌లన్ని వాష్ అవుట్ అయితే పరిస్థితి ఏంటి.? ఏ జట్లు ఫైనల్ కు వెళ్తాయి.ఫైనల్ కు వెళ్లే జట్లను ఏ విధంగా నిర్ణయిస్తారో చూద్దాం.
సూపర్-4 లో భారత్, శ్రీలంక( India , Sri Lanka ) జట్లు మూడేసి మ్యాచులు ఆడాల్సి ఉంది.పాకిస్తాన్, బంగ్లాదేశ్ ( Pakistan, Bangladesh )జట్లు రెండేసి మ్యాచులు ఆడాల్సి ఉంది.సూపర్-4 తొలి మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్ రెండు పాయింట్లతో ఉంది.సెప్టెంబర్ 10న భారత్, సెప్టెంబర్ 14న శ్రీలంకతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే.ఒక్కో పాయింట్ జత అవడంతో పాకిస్తాన్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటాయి.దీంతో పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంటుంది.సూపర్-4 లో భారత్, శ్రీలంక జట్లు ఆడాల్సిన మూడు మ్యాచులు వర్షం కారణంగా రద్దయితే ఇరుజట్ల ఖాతాలలో మూడేసి పాయింట్లు చేరతాయి.బంగ్లాదేశ్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయితే బంగ్లాదేశ్ ఖాతాలో రెండు పాయింట్లు చేరతాయి.భారత్, శ్రీలంక జట్ల నెట్ రన్ రేట్ సమంగా ఉంటుంది.దీంతో ఫైనల్ కు చేరే జట్టు కోసం భారత్, శ్రీలంక మధ్య పోటీ ఉండనుంది.ఈ సమయంలో టాస్ ద్వారా ఫైనల్ చేరే జట్టును నిర్ణయిస్తారు.
భారత్, శ్రీలంకలలో ఏ జట్టు టాస్ గెలిస్తే ఆ జట్టు ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడుతుంది.