Sobhan Babu: సినిమాలు మానేశాక శోభన్ బాబు ఇంటి నుండి బయటకు రాకపోవడానికి కారణం ఆ అమ్మాయేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడు శోభన్ బాబు(Sobhan Babu).ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారందరి లాగే ఈయన కూడా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు.

 Reason Behind Why Sobhan Babu Didnt Come Out Of The House After Quitting Movies-TeluguStop.com

ఒకే ఒక్క అవకాశంతో సినిమాల్లోకి వచ్చి స్టార్ నటుడిగా ఇండస్ట్రీని ఏలి నటనలో కంటే ఎక్కువగా సంపాదనలో హైయెస్ట్ పొజిషన్ కి వెళ్లారు.ఇక ఈయన ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోల కంటే పెద్ద సంపన్నుడు అని చెప్పుకోవచ్చు.

ఆయనకు ఆ రోజుల్లోనే మద్రాస్ (Madras) లో 50 వరకు బిల్డింగులు ఉన్నాయంటే సినిమాలతో వచ్చిన డబ్బులను మొత్తం ఎలా పొదుపు చేసి ఆస్తులు కొన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఆయన ఇండస్ట్రీలో ఎప్పటికీ హీరోలాగే ఉండాలి అని అనుకున్నారు.

అంతేకాదు అప్పటివరకు హీరోగా చేసి అదే దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్లి నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అని అడగాల్సిన సమయం ఎప్పుడు రాకూడదని భావించారు.అంతేకాదు స్వయంగా దర్శక నిర్మాతలే ఆయన ఇంటికి వచ్చి కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించమని,హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినా కూడా నేను నా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ హీరో గానే ఉంటాను కానీ వేరే క్యారెక్టర్లు మాత్రం పోషించను అని వారికి మొహం మీదే చెప్పేవారట.

Telugu Annamayya, Athadu, Sobhan Babu, Madras, Mahesh Babu, Najar, Tollywood-Mov

ఇక శోభన్ బాబు 1996లో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.అయితే సినిమా ఇండస్ట్రీలో రిటైర్మెంట్ అనేది ఉండదు కానీ ఈయన మాత్రం హీరోగా అవకాశాలు తగ్గాక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు.ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో హీరో కాకుండా వేరే అవకాశాలు వచ్చినా కూడా అందులో నటించలేదు.అలా అన్నమయ్య (Annamayya) సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర, అతడు సినిమాలో( Athadu Movie ) నాజర్ పాత్రని ఈయన మిస్ చేసుకున్నారు.

ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ మద్రాస్ లో తన ఆస్తి పాస్తులు చూసుకుంటూ ఐదు సంవత్సరాల పాటు అన్ని ఫంక్షన్లకు వచ్చేవారు.

Telugu Annamayya, Athadu, Sobhan Babu, Madras, Mahesh Babu, Najar, Tollywood-Mov

కానీ ఎప్పుడైతే ఓ సినిమా ఫంక్షన్ లో ఆయన పక్కనే కూర్చున్న ఓ అమ్మాయి శోభన్ బాబు (Sobhan Babu) గారు మీరు చాలా పెద్దవారు అయిపోయారండి అని అన్న ఒకే ఒక్క మాటకి శోభన్ బాబు గ్లామర్ అహం దెబ్బ తిన్నదట.అప్పటినుండి ఆ అమ్మాయి మాటలను గుర్తుంచుకొని బయటికి వెళ్తే ఇంకా ఎంతమంది నన్ను ఈ మాటలు అంటారో అని భయపడి అప్పటినుండి బయటికి వెళ్లడమే మానేశారట.అలా చివరి రోజుల్లో శోభన్ బాబు ఆయన మొహాన్ని ఎవరికి కూడా చూపించలేదు.

ఈ కారణంతో ఇండస్ట్రీలో కొంతమంది శోభన్ బాబు కి మానసిక వ్యాధి ఏదో వచ్చింది అంటూ వార్తలు సృష్టించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube