మనలో చాలామందికి జాతరలో రోలర్ కోస్టర్ ( roller coaster )ఎక్కడమంటే మహా సరదా.రోలర్ కోస్టర్ ఎక్కి అలా గాల్లో తేలిపోతుంటే చాలా సరదాసరదాగా ఉంటుంది.
అయితే అంతే భయం వేస్తుంది కూడా.అందుకే హార్ట్ ఎటాక్స్ వున్నవారు ఇలాంటివి ఎక్కాలంటే కాస్త భయపడతారు.
ఇక రోలర్ కోస్టర్ ఎక్కినపుడు అనుకోకుండా అది తలకిందులుగా ఆగిపోతే ఎలా ఉంటుంది? దాదాపు చావు పరిచయం అవుతుంది.ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.
కాగా దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెరికాలో ( America )ఒక అమ్యూజ్మెంట్ పార్కులో( amusement park ) జనంతో ఉన్న ఒక రోలర్ కోస్టర్, రైడ్ జరుగుతుండగా అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది.దాంతో అది మధ్యలోనే ఆగిపోయింది.దీంతో అందులో ఉన్న వారు తలకిందులుగా వేలాడుతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని దాదాపు 3 గంటలపాటు నరక యాతన చవిచూశారంటే వారి బాధను అర్ధం చేసుకోవచ్చు.
ఇలా యాంత్రికంగా ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దేవుడిమీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు.ఆ క్షణంలో పరిస్థితి ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు.
అయితే అదృష్టవశాత్తూ వారికి ఏమి కాలేదని తెలుస్తోంది.ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆగిపోయిన రోలర్ కోస్టర్ లో 8 మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులేనని భోగట్టా.సహాయక బృందం వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి తెలిపారు.
మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని, విస్కాన్సిన్ బృందం( Wisconsin team ) ఇటీవలే ఇక్కడ తనిఖీలు కూడా చేశారని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, ఇంతకు మించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు చెబుతున్నారు.