రాజన్న సిరిసిల్ల జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రగతితో పాటు… పర్యావరణ పరిరక్షణకు సమప్రాధాన్యతనిస్తుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని రగుడు జంక్షన్ వద్ద తెలంగాణ హరితోత్సవ వేడుకలను ఘనంగా,పండుగ వాతావరణంలో నిర్వహించారు.
రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మొక్కలు నాటారు.సిరిసిల్ల మున్సిపాలిటీ( Sirisilla Municipality ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఆకుపచ్చని హరితహారం ఆవశ్యకతను తెలిపేలా వేసిన రంగవళ్లులు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anu Anurag Jayanthi )మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.గత ఎనిమిది విడతల్లో హరితహారంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందన్నారు.
అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా తొమ్మిదో విడత హరితహారంలో అందరూ భాగస్వామ్యమై, మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.అలాగే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంపద వనాలు అనే కార్యక్రమం ఈరోజు ప్రారంభించిందని తెలిపారు.
మన జిల్లాలో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పార్కుల అభివృద్ధితో పాటు, వెంకటాపూర్ సమీపంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.పచ్చదనం భవిష్యత్ తరాలకు వరమని, ప్రకృతి సంపదను కాపాడడం ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా మాట్లాడుతూ తెలంగాణ హరితహారం తో భరతమాతకు మణిహారాన్ని అందించిన గొప్ప ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలనను సాగిస్తూ పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో తెలంగాణను హరిత తెలంగాణగా మార్చే దిశగా హరితహారం కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు.8 విడతల్లో హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.జిల్లా మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు సిరిసిల్ల ను ఆకుపచ్చని సిరిసిల్ల గా మార్చలని కోరారు.
హరితహారం కార్యక్ర( Haritha Haram Programme )మం లో అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ హరిత సైనికులు గా మారి సిరిసిల్ల ను ఆకుపచ్చని సిరిసిల్లగా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సిరిసిల్ల ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కమీషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా “హరిత సంబురం”రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District _) వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం విజయవంతమైంది.జిల్లాలోని పట్టణాలతో పాటు, అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున హరితోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు
.