పవన్ నోట.. మళ్ళీ అదే మాట !

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ( Jana sena party ) క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ ఆ దిశగా అనుసరిస్తున్న వ్యూహాలన్నీ కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తుప్రస్తుతంన్నాయి.

 Pawan Kalyan Political Strategy In Ap, Pawan Kalyan , Ap Politics , J. P. Nadda-TeluguStop.com

వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వమని, అందుకోసం ఇతర పార్టీలతో కలిసేందుకు కూడా సిద్దమే అని పవన్ గత కొన్నాళ్లుగా పొత్తులపై క్లారిటీ ఇస్తున్నే ఉన్నారు.అయితే ఇప్పటివరకు అధికారికంగా ఒక్క బీజేపీతో మాత్రమే పొత్తులో ఉన్నారు పవన్.

అయితే ఏపీలో బలహీనమైన బీజేపీతో కలిసి వైసీపీని ఎదుర్కోవడం కష్టమే.అందుకే టీడీపీతో చేతులు కలపాలని పవన్ చూస్తున్నారు.

Telugu Ap, Chandra Babu, Nadda, Janasena, Pawan Kalyan-Politics

టీడీపీ( TDP )తో జనసేన పొత్తు ఉంటుందని పరోక్షంగా పవన్ చాలాసార్లు స్పష్టం చేశారు కూడా.అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్( Pawan Kalyan ) తో చేతులు కలిపేందుకు సిద్దంగానే ఉన్నారు.కానీ అధికారికంగా ఈ రెండు పార్టీల మద్య పొత్తును అటు పవన్ గాని ఇటు చంద్రబాబు గాని ప్రకటించలేదు.దాంతో పొత్తుల విషయంలో ఈ రెండు పార్టీల మద్య ఏం జరుగుతోందనే చర్చ హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.

ఇటీవల చంద్రబాబుతో పవన్ బేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ బేటీలో పొత్తుల విషయంలో ఇద్దరు అధినేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపించాయి.

కానీ అధికారికంగా ప్రకటించలేదు.తాజాగా పవన్ మరోసారి పొత్తులపై పాత మాటే వినిపించారు.

Telugu Ap, Chandra Babu, Nadda, Janasena, Pawan Kalyan-Politics

వైసీపీ వ్యతిరేక ఓటును చిలనివ్వమని అందుకోసం తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని పవన్ చెప్పుకొచ్చారు.పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదని బీజేపీ, బి‌ఆర్‌ఎస్ వంటి పార్టీలు కూడా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని బలపడ్డాయని పవన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఏపీలో వైసీపీని గద్దె దించాలంటే పొత్తు అనివార్యం అయింది.ఇదే విషయాన్ని పవన్ బీజేపీ జాతీయ అద్యక్షుడు నడ్డాకు( J.P.Nadda ) కూడా వివరించినట్లు పవన్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం పవన్ టీడీపీతో కలిసేందుకు సిద్దంగానే ఉన్న.అటు బీజేపీని వాదులుకోవడానికి సిద్దంగా లేరనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.అందుకే ఇంకా టీడీపీతో పొత్తు విషయమై పవన్ పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఎన్నికలకు 10 నెలలు మాత్రమే సమయం ఉండడంతో పవన్ పొత్తుల విషయంలో ఎప్పుడు పూర్తి స్పష్టత ఇస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube