నల్లగొండ జిల్లా: నల్లగొండ రూరల్ మండలంలోని నర్సింగ్ భట్ల (కూతురుగూడెం), నారబోయినగూడెం (దోమలపల్లి),గూడపుర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు గ్రామప్రజల అభిప్రాయం తీసుకోకుండా కేవలం నర్సింగ్ భట్ల గ్రామ పాలకవర్గం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై మిగతా రెండు గ్రామాల పాలక వర్గాలు,మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం శ్రీ గాయత్రి మైనింగ్ బ్లాక్ గ్రానైట్ కంపెనీకి వ్యతిరేకంగా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ సదరు కంపెనీకి అనుమతి ఇచ్చిన నర్సింగ్ భట్ల గ్రామానికి చెందిన ప్రతిపక్ష వార్డు సభ్యులకు,గ్రామ ఎంపీటీసీకి పూర్తి సమాచారం ఇవ్వకుండా, గ్రామ ప్రజలకు తెలియకుండా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తీర్మానం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
దీనిని ఎట్టిపరిస్థతుల్లోనూ తాము ఒప్పుకునేది లేదని,ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే కంపెనీ పనులు ప్రారంభించాలని తెగేసి చెప్పారు.ఈ ప్రాజెక్టుకు 200 మీటర్ల దూరంలో 230 ఎకరాల విస్తీర్ణం గల గంగదేవి చెరువు ఉన్నదని,చెరువు భూగర్భ జలాల మీద ఆధారపడి 600 ఎకరాల విస్తీర్ణం గల పంట భూములు ఉన్నాయని మైనింగ్ బ్లాస్టింగ్ వలన చెరువుకు ప్రమాదం ఉందని, అలాగే చెరువుపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు వృత్తి కనుమరుగవుతుందనిఅన్నారు.
ఇవేమీ పట్టకుండా ప్రజల జీవితాలను ఫణంగా పెట్టి అనుమతులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు.