టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసు విచారణ వాయిదా పడింది.ఈ కేసుపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది.
ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తు వేగంగా జరగడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.దర్యాప్తు పురోగతి నివేదిక జూన్ 5వ తేదీన ఇవ్వాలని సిట్ కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.