సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.సగటున సెకెనుకి ఒకటి చొప్పున వైరల్ అవుతుందని భోగట్టా.
అయితే వాటిలో పెంపుడు కుక్కలకు,( pet dogs ) పిల్లులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.అవి చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు కారణంగా నెటిజన్లు వాటిని అమితంగా ఇష్టపడుతూ వుంటారు.
ఈ క్రమంలోనే పెట్ లవర్స్ అనేవారు ఇలాంటి వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు.తాజాగా ఓ పెట్ లవర్‌పై తన పెంపుడు కుక్క రివెంజ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇక ఆ పెంపుడు కుక్క చేసిన పనిని మీరు ఈ వీడియోలో చూస్తే అవాక్కవుతారు.ఆ వీడియోలోని పెంపుడు కుక్క ఓ స్కూటీకి( Scooty ) కట్టేసి ఉండడం గమనించవచ్చు.చూడడానికి పార్కింగ్ ఏరియాలాగా ఉన్న ఆ ప్రాంతంలో తన పెంపుడు కుక్కను స్కూటీకి కట్టేసి సదరు ఓనర్ ఎక్కడికో బయటకి వెళ్ళాడు.దీంతో ఆ కుక్కకు తిక్కరేగి తన ఓనర్ స్కూటీ సీట్‌ని( Owner scooty seat ) కాలి గోర్లతో చించేయడం ప్రారంభించింది.
ఇక ఆ పార్కింగ్ ఏరియాలోనే ఉన్న వ్యక్తి ఒకరు దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు.
అలా నెట్టింట చెక్కర్లు కొడుతున్న వీడియోను తాజాగా డిస్కవరీ ఇంగేంహరియా అనే ఇన్‌స్టా వేదికగా షేర్ కాబడింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేయడంతో నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.వీరిలో ఓ నెటిజన్ ‘పాపం ఆ పెంపుడు కుక్క.
దాని ఓనర్ కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయింది, అందుకే అలా చేసింది’ అంటూ సరదా కామెంట్ చేశాడు.‘స్మార్ట్ రివెంజ్.ఇలా చేస్తేనే ఓనర్స్ తమ పెంపుడు కుక్కలను కట్టేయకుండా ఉంటారు’ అని రాసుకొచ్చాడు మరో నెటిజన్.