వైరల్: స్కూటీకి కట్టిపడేశారని ఏకంగా ఓనర్ పైనే రివేంజ్ తీర్చుకున్న పెంపుడు కుక్క!

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.సగటున సెకెనుకి ఒకటి చొప్పున వైరల్ అవుతుందని భోగట్టా.

అయితే వాటిలో పెంపుడు కుక్కలకు,( Pet Dogs ) పిల్లులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.

అవి చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు కారణంగా నెటిజన్లు వాటిని అమితంగా ఇష్టపడుతూ వుంటారు.

ఈ క్రమంలోనే పెట్ లవర్స్ అనేవారు ఇలాంటి వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు.

తాజాగా ఓ పెట్‌ లవర్‌పై తన పెంపుడు కుక్క రివెంజ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

"""/" / ఇక ఆ పెంపుడు కుక్క చేసిన పనిని మీరు ఈ వీడియోలో చూస్తే అవాక్కవుతారు.

ఆ వీడియోలోని పెంపుడు కుక్క ఓ స్కూటీకి( Scooty ) కట్టేసి ఉండడం గమనించవచ్చు.

చూడడానికి పార్కింగ్ ఏరియాలాగా ఉన్న ఆ ప్రాంతంలో తన పెంపుడు కుక్కను స్కూటీకి కట్టేసి సదరు ఓనర్ ఎక్కడికో బయటకి వెళ్ళాడు.

దీంతో ఆ కుక్కకు తిక్కరేగి తన ఓనర్ స్కూటీ సీట్‌ని( Owner Scooty Seat ) కాలి గోర్లతో చించేయడం ప్రారంభించింది.

ఇక ఆ పార్కింగ్ ఏరియాలోనే ఉన్న వ్యక్తి ఒకరు దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు.

"""/" / అలా నెట్టింట చెక్కర్లు కొడుతున్న వీడియోను తాజాగా డిస్కవరీ ఇంగేంహరియా అనే ఇన్‌స్టా వేదికగా షేర్ కాబడింది.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేయడంతో నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

వీరిలో ఓ నెటిజన్ ‘పాపం ఆ పెంపుడు కుక్క.దాని ఓనర్ కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయింది, అందుకే అలా చేసింది’ అంటూ సరదా కామెంట్ చేశాడు.

‘స్మార్ట్ రివెంజ్.ఇలా చేస్తేనే ఓనర్స్ తమ పెంపుడు కుక్కలను కట్టేయకుండా ఉంటారు’ అని రాసుకొచ్చాడు మరో నెటిజన్.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!