కోవిడ్ మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.రోజు వారీ వ్యవహారాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యత పెరిగింది.
ముఖ్యంగా వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులలో భారీ ఆఫర్లు ఉన్నాయి.వాటిని ఉపయోగించుకుని, పలు సందర్భాలలో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు పొందొచ్చు.
ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఎస్‌బీఐ ఎన్నో చక్కటి ఆఫర్లు అందుబాటులో ఉంచింది.స్మార్ట్ ఫోన్లు, టీవీ, ఫ్రిజ్ వంటివి కొనుగోలు చేస్తే బ్రాండ్లను బట్టి చాలా డిస్కౌంట్లు పొందొచ్చు.
అంతేకాకుండా విమాన టికెట్ల కొనుగోలులో కూడా బంపరాఫర్లు అందుబాటులో ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.
క్లియర్ ట్రిప్ ద్వారా ఎస్‌బీఐ కార్డుదారులు విమాన టికెట్లను కొనుగోలు చేస్తే 12 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.అయితే కనీస చెల్లింపులు రూ.5 వేలు ఉండాలి.ఇలా గరిష్టంగా రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి 25వ తేదీ వరకు మాత్రమే ఉంది.
ఇక టూవీలర్స్ కొనుగోలు చేసే వారు కూడా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.హోండా టూ వీలర్స్ కొనుగోలుదారులకే ఇది వర్తిస్తుంది.కనీస చెల్లింపు రూ.40 వేలు ఉంటే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.ఈ నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.ఐఎఫ్‌బీ వాషింగ్ మెషీన్ కొనుగోలు చేస్తే 12.5 శాతం లేదా రూ.7500ల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా ఎల్‌జీ ప్రొడక్టులను కొనుగోలు చేస్తే 22.5 శాతం క్యాష్ బ్యాక్ లేదా రూ.25 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.ఒక్కో కార్డుపై ఈ గరిష్ట మొత్తంలో ఆఫర్ వినియోగించుకోవచ్చు.అయితే ఫిబ్రవరి 23వ తేదీలోపు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.ఒప్పో ఫోన్లను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ లేదా రూ.5 వేలు డిస్కౌంట్ పొందొచ్చు.ఇవే కాకుండా శామ్‌సంగ్ ప్రొడక్టులపై కూడా రూ.25 వేల వరకు డిస్కౌంట్ పొందే వీలుంది.