బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం అన్ని భాషలలో సీజన్లను ప్రసారం చేసుకుంటూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక తెలుగులో కూడా ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.ఇలా ఈ సీజన్ ప్రారంభం నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారనే వార్త ఇప్పటికే వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ప్రతి సీజన్లో వచ్చే విధంగా ఈ సీజన్లో కూడా యాంకర్ రష్మీ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారనీ వార్తలు వస్తున్నాయి.ఇలా రష్మీ గురించి ప్రతి సీజన్లో వార్తలు రావడం ఆ కార్యక్రమంలో ఆమె పాల్గొనక పోవడం జరుగుతుంది.ప్రతి సీజన్ లాగే ఈ సీజన్లో కూడా రష్మీ పాల్గొనబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే రష్మీ బిగ్ బాస్ సెవెన్ గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.
ప్రతిసారి తన పేరు ప్రస్తావనకు వస్తోందని అయితే ఈ కార్యక్రమం ప్రారంభమైన ప్రతిసారి ఏదో ఒక షో, కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నానని రష్మీ తెలిపారు.తాను కుటుంబం, తన స్నేహితులు, తన పెంపుడు కుక్కను వదిలేసి అన్ని రోజులపాటు ఉండలేనని అందుకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లలేదని తెలిపారు.అయినా బిగ్ బాస్ కార్యక్రమానికి సరిపోయే వ్యక్తిని తాను కాదు అంటూ ఈ సందర్భంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చేశారు.ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.