అవును, మీరు ఆ యూట్యూబర్ ని మెచ్చుకోకుండా ఉండలేరు.అతగాడు ఏం సాధించాడు అనేకంటే ఎంతమంది మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు అని ఇక్కడ ప్రస్తావించుకోవడం ముఖ్యం.
అతడే ప్రముఖ యూట్యూబర్ Jimmy Donaldson.అతగాడు తాజాగా కంటిచూపు కోల్పోయిన వేలమంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడు.
మొత్తం వెయ్యి మందికి పైగా వున్న జన సమూహానికి Cataract ఆపరేషన్ ఖర్చును తానే సొంతంగా భరించారు.ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేనివారికి ఆర్థికసాయం, ఇతరత్రా చేయూతను కూడా ఈ నేపథ్యంలో అతగాడు అందించి తన ఉదారాన్ని చాటుకున్నాడు.
అవును, ఆయన సాయంతో కంటిచూపు పొందిన వారి సంఖ్య నేటికి 1000కి చేరుకోవడం నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి.యూట్యూబ్‌లో జిమ్మీ.మిస్టర్ బీస్ట్‌గా బాగా పాపులర్ అయ్యాడు.
ఈ క్రమంలో తాను సంపాదించిన మొత్తంలో ఇలా సమాజ సేవకే వినియోగించడం విశేషం.ఈ మహాక్రతువులో తొలి విడత ఆపరేషన్లను డా.జెఫ్ లెవెన్సన్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో జమైకా, నమీబియా, హాండురస్, మెక్సికో, ఇండోనేషియా, వియత్నాం, బ్రెజిల్, కెన్యాకు చెందిన వారికి ఈ ఆపరేషన్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా.జెఫ్ మాట్లాడుతూ… “ఈ ప్రపంచంలోని చూపు లేనివాళ్లలో సగం మందికి పైగా కావాల్సింది కేవలం 10 నిమిషాల్లో చేయవలసిన ఈ శస్త్రచికిత్సే!” అంటూ డా.జెఫ్ వ్యాఖ్యానించారు.కాగా జిమ్మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.నెటిజన్లు పెద్ద ఎత్తున అతగాడిని ప్రశంసిస్తున్నారు.“ఇలాంటి గొప్ప పని గురించి ఇంతకుముందెన్నడూ వినలేదు” అని ఒకరంటే “నీవెప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటావు” అంటూ మరికొందరు జిమ్మీని పొగుడుతున్నారు.