కరోనా తరువాత పెను విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.ఆయిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి సారించాయి.
కార్‌లు, స్కూటర్‌లతో పాటు ఇప్పుడు ప్రీమియం బైక్‌లను కూడా లాంచ్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ Ultraviolette ఆటోమోటివ్ ఇండియన్ మార్కెట్‌లోకి 3 కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను లాంచ్ చేసింది.
ఆ వేరియంట్లు F77, రీకాన్, ఎఫ్ 77 లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ పేర్లతో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి.కాగా ఇవి ఎలక్ట్రిక్ బైక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

అవును, ఇక ఈ 3 బైక్‌ల డిజైన్, ఫీచర్లలో తేడా ఉన్నప్పటికీ, వాటి పనితీరులో మాత్రం పెద్ద తేడా అనేది ఉండదు.అయితే కేవలం లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు 77 యూనిట్లు మాత్రమే మార్కెట్‌లోకి రిలీజ్ చేసారు.ఇవి విడుదలైన కేవలం 2 గంటల్లోనే సేల్ అయిపోవడం కొసమెరుపు.F77 ఒరిజినల్ వేరియంట్ రూ.3.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) వద్ద అందుబాటులో ఉండగా, F77 రీకాన్ రూ.4.55 లక్షల(ఎక్స్ షోరూమ్)కి, F77 స్పెషల్ ఎడిషన్ రూ.5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో వున్నాయి.

ఇక F77 ఒరిజినల్ వేరియంట్ ఫీచర్ల విషయానికొస్తే… ఈ ఎలక్ట్రిక్ బైక్ 27-kW ఎలక్ట్రిక్ మోటార్, IP67-రేటెడ్ 7.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది.దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 206 కి.మీలు మేర ప్రయాణించవచ్చు.అంతేకాకుండా కేవలం 8.3 సెకన్లలో 0- నుంచి 100kmph వేగాన్ని చేరుకోగలదు.అలాగే రెండవ వేరియంట్ F77 రీకాన్ విషయానికొస్తే… ఈ బైక్ సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 307 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే ఇది కాస్త మెరుగ్గా పనిచేస్తుంది.
చివరగా మూడవ వేరియంట్ చూస్తే… ఇది 40 bhp గరిష్ట శక్తి, 100Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన మోటారుతో వస్తుంది.డిజైన్ పరంగా టాప్ స్పీడ్ రీకాన్ వేరియంట్ మాదిరిగానే ఉన్నప్పటికీ, కేవలం 7.8 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకోగలదు.







