రక్త సంబంధం వట్టి పోతుందా? ఎంతైనా వారసులు మరి.అవును, ఆదిత్య బిర్లా గ్రూప్ వారసులు వ్యాపారాల్లో బాగానే రాణిస్తున్నారు.
ఇప్పటికే కొన్ని కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా తాజాగా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ డైరెక్టర్లుగా మారారు.ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కొడుకు, కుమార్తెలే అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు స్పందిస్తూ… “అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా తమ గ్రూప్ తో కలిసి కంపెనీ వ్యవస్థాపకత, వ్యాపార నిర్మాణంలో గొప్ప పెనుమార్పులు తీసుకువస్తారని, వారి కొత్త ఆలోచనలు, వ్యాపార నైపుణ్యం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్‌కు ఎంతో మేలు చేయనుంది!” అని బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ పేర్కొంది.
అయితే ఇంకా వీళ్ల నియామకానికి కంపెనీ వాటాదార్ల ఆమోదం లభించాల్సి వుంది.ఈ విషయంలో వాటాదార్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇకనుండి ఆదిత్య బిర్లా గ్రూప్ యువ తరానికి అనన్య ఆర్యమన్ నాయకత్వం వహిస్తున్నారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యాపారాలకు వ్యూహాత్మక దిశను అందించే బాధ్యతతో పని చేస్తున్న ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్లో ఇటీవలే డైరెక్టర్లుగా నియమించ బడ్డారు.ఎంచుకున్న రంగాల్లో తన వారసులు వ్యక్తిగతంగా సాధించిన అద్భుత విజయాల వారిని మరింత గొప్ప బాధ్యతలకు సిద్ధం చేశాయయని కుమార మంగళం బిర్లా చెప్పారు.
ఇకపోతే అనన్య బిర్లా, ఆర్యమన్ విక్రమ్ బిర్లా తమ సామర్థ్యాలను ఈపాటికే నిరూపించుకున్నారు.ఎందుకంటే వారు కొన్ని కంపెనీలను ఆల్రెడీ స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారు.17 సంవత్సరాల వయస్సులో, తన మొదటి కంపెనీ అయినటువంటి Svatantra Microfin Pvt Ltd అనన్య స్థాపించారు.భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి.
ఈ కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు ఒక బిలియన్ డాలర్ల విలువను అధిగమించాయి అని టాక్.ఇక ఆర్యమాన్ బిర్లా ఫస్ట్ క్లాస్ క్రికెటర్.వ్యవస్థాపకత, VC పెట్టుబడి సహా అనేక రకాల అనుభవం ఉంది.