ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి ఇక ఈ సినిమాని రెండు పార్ట్స్ గా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించి ,ప్రభాస్ కు బిగ్గెస్ట్ హిట్ అందించారు .యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిపోయారు .
ఇక బాహుబలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది .ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత తాను తరువాత చేయపోయే తరువాత మూవీస్ కూడా పాన్ ఇండియా సినిమాలే చేద్దాం అని డిసైడ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో ప్రభాస్ బాహుబలి సినిమా పూర్తి అయ్యాక యంగ్ టాలెంటడ్ డైరెక్టర్ సుజిత్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా సాహో సినిమా చేసాడు ,ఇక ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ ,సాంగ్స్ యాక్షన్ సీన్స్ , ప్రభాస్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేదు .ఇక ఈ సినిమా తరువాత వచ్చిన రాధే శ్యామ్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం అందుకోలేదు .
ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు .రాధే శ్యామ్ మూవీ తరువాత ప్రభాస్ చేతిలో ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కె , స్పిరిట్ మూవీ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి , అయితే వీటిలో ఆదిపురుష్ సినిమా నుండి మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిన విషయమే .ఇక ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ లైన్ లో ఉన్నప్పటికీ , ప్రభాస్ వీటి మధ్య లో చిన్న బడ్జెట్ మూవీ చేద్దాము అని డిసైడ్ అయ్యాడు , ఇక 2022లో డైరెక్టర్ మారుతీ మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ పక్కా కమర్షియల్ , ఇక ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ , గోపీచంద్ స్టైలిష్ యాక్టింగ్ , డైరెక్టర్ మారుతీ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .
![Telugu Salaar, Maruthi, Prasanth Neel, Prabhas, Maruthi Prabhas, Prabhas Fans, P Telugu Salaar, Maruthi, Prasanth Neel, Prabhas, Maruthi Prabhas, Prabhas Fans, P](https://telugustop.com/wp-content/uploads/2023/01/director-maruthi-prabhas-combo-movie-latest-update-detailsa.jpg )
ఈ మూవీ తరువాత డైరెక్టర్ మారుతీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి ,అసలు ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ ఏమిటి ? ఇది నిజమా లేక గాసిప్ అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి , ఫైనల్ గా ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ , ప్రభాస్ డైరెక్టర్ మారుతీ చెప్పిన స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .ఇక ఈ సినిమాని పీపుల్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇంతవరకు బయటకు రాలేదు .కానీ ఈ మూవీ కి సంబంధించి షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం మరో విశేషం.బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టి తనపై తిప్పుకున్న ఈ హీరో సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .
![Telugu Salaar, Maruthi, Prasanth Neel, Prabhas, Maruthi Prabhas, Prabhas Fans, P Telugu Salaar, Maruthi, Prasanth Neel, Prabhas, Maruthi Prabhas, Prabhas Fans, P](https://telugustop.com/wp-content/uploads/2023/01/director-maruthi-prabhas-combo-movie-latest-update-detailss.jpg )
గతేడాది విడుదలైన ఆదిపురుష్ టీజర్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.ఈ క్రమంలోనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీపైనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి .తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది .టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కల్ ప్రచారం మేరకు ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని టాక్ వినిపిస్తోంది .ఇక అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే 2023 దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ,మరి ఈ మూవీ పై వస్తున్న వార్తలో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాలసిందే.