మారుతి - ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురుంచి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్

ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి ఇక ఈ సినిమాని రెండు పార్ట్స్ గా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించి ,ప్రభాస్ కు బిగ్గెస్ట్ హిట్ అందించారు .

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిపోయారు .

ఇక బాహుబలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది .

ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత తాను తరువాత చేయపోయే తరువాత మూవీస్ కూడా పాన్ ఇండియా సినిమాలే చేద్దాం అని డిసైడ్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ బాహుబలి సినిమా పూర్తి అయ్యాక యంగ్ టాలెంటడ్ డైరెక్టర్ సుజిత్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా సాహో సినిమా చేసాడు ,ఇక ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ ,సాంగ్స్ యాక్షన్ సీన్స్ , ప్రభాస్ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేదు .

ఇక ఈ సినిమా తరువాత వచ్చిన రాధే శ్యామ్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం అందుకోలేదు .

ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు .

రాధే శ్యామ్ మూవీ తరువాత ప్రభాస్ చేతిలో ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కె , స్పిరిట్ మూవీ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి , అయితే వీటిలో ఆదిపురుష్ సినిమా నుండి మోషన్ పోస్టర్ టీజర్ రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిన విషయమే .

ఇక ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా పాన్ ఇండియా మూవీస్ లైన్ లో ఉన్నప్పటికీ , ప్రభాస్ వీటి మధ్య లో చిన్న బడ్జెట్ మూవీ చేద్దాము అని డిసైడ్ అయ్యాడు , ఇక 2022లో డైరెక్టర్ మారుతీ మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ పక్కా కమర్షియల్ , ఇక ఈ మూవీ ట్రైలర్స్ అండ్ టీజర్స్ , గోపీచంద్ స్టైలిష్ యాక్టింగ్ , డైరెక్టర్ మారుతీ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది .

"""/"/ ఈ మూవీ తరువాత డైరెక్టర్ మారుతీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి ,అసలు ప్రభాస్ - మారుతీ కాంబినేషన్ ఏమిటి ? ఇది నిజమా లేక గాసిప్ అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి , ఫైనల్ గా ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ , ప్రభాస్ డైరెక్టర్ మారుతీ చెప్పిన స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

ఇక ఈ సినిమాని పీపుల్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇంతవరకు బయటకు రాలేదు .

కానీ ఈ మూవీ కి సంబంధించి షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం మరో విశేషం.

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టి తనపై తిప్పుకున్న ఈ హీరో సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .

"""/"/ గతేడాది విడుదలైన ఆదిపురుష్ టీజర్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీపైనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి .

తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది .

టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కల్ ప్రచారం మేరకు ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని టాక్ వినిపిస్తోంది .

ఇక అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే 2023 దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ,మరి ఈ మూవీ పై వస్తున్న వార్తలో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాలసిందే.

Royal Panda: Player Safety And Responsible Gambling — An NZ Practical Guide