సీనియర్ నటుడు చలపతిరావు వందల సంఖ్యలో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.78 సంవత్సరాల వయస్సులో ఆయన గుండెపోటుతో మరణించారనే వార్త ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది.అయితే ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చదువుకునే రోజుల్లోనే నేను నాటకాలు వేసేవాడినని సీనియర్ ఎన్టీఆర్ ను కలిసి వేషం కావాలని అడిగితే వేషాలు రావడం కష్టమని ఆయన చెప్పారని చలపతిరావు పేర్కొన్నారు.
ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో వేషం ఇప్పించారని చలపతిరావు పేర్కొన్నారు.కథానాయకుడు సినిమా నా తొలి సినిమా అని ఆ సినిమాలో డైలాగ్ బాగా చెప్పడంతో నేను హీరోగా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశారని కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని చలపతిరావు అన్నారు.
చెన్నైలో నేను ఇల్లు కట్టుకుంటే సీనియర్ ఎన్టీఆర్ వచ్చి ముహూర్తం పెట్టారని చలపతిరావు కామెంట్లు చేయడం గమనార్హం.
చదువు విషయంలో పిల్లలను ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయలేదని ఆయన తెలిపారు.భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో బస్సు పైనుంచి దిగుతుంటే ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో కాలు విరిగిందని వెన్నముకకు దెబ్బ తగిలిందని చలపతిరావు అన్నారు.ఆరు నెలలు బెడ్ పై ఉన్నానని ఆ సమయంలో చనిపోవాలని అనిపించిందని ఆయన కామెంట్లు చేశారు.
ఎనిమిది నెలల తర్వాత కాలు సెట్ అయిందని ఆయన అన్నారు.ఆ ప్రమాదం తర్వాత నేను వినయ విధేయ రామ మూవీ షూట్ లో పాల్గొన్నానని చలపతిరావు చెప్పుకొచ్చారు.చలపతిరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు.అయితే ఆ నవ్వుల వెనుక ఎన్నో విషాదాలు ఉన్నాయని చాలామంది చెబుతారు.చలపతిరావు మృతితో గొప్ప నటుడిని కోల్పోయామని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.