ఒక సినిమా ఎంతో కష్టపడి తీస్తారు దర్శక నిర్మాతలు.సినిమా అంటేనే వ్యవ్యప్రయాసలకు సంబందించిన పని.ఎన్ని రోజుల పాటు కష్టపడి సినిమా పూర్తి చేసాక తీరా సెన్సార్ చేతిలో పడి ముక్కలు ముక్కలుగా కట్టింగ్ కి గురయితే ఎలా ఉంటుంది చెప్పండి.ఆ సీన్స్ ని మళ్లి రీషూట్ చేయాల్సిందే.
ఆ తర్వాత మాత్రమే సినిమాను థియేటర్ లో విడుదల చేయగలరు.ఇక మన తెలుగు సినిమాల్లో తక్కువే కానీ ఇండియాలో కొన్ని సినిమాలు అయితే సెన్సార్ వారు పూర్తిగా బ్యాన్ చేసినవి కూడా ఉన్నాయ్.
ఆలా ఒక్కసారి బ్యాన్ అయ్యాక ఆ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేయలేరు.ఇక ఈ మధ్య కాలంలో అయితే ఓటిటి వల్ల ఈ సెన్సార్ ఇబ్బందులు తగ్గాయనే చెప్పాలి.
ఎందుకంటే చాల సినిమాలు నేరుగా ఓటిటి లో విడుదల అవుతున్నాయి.వారికి సెన్సార్ తో పని లేదు.నేరుగా విడుదల చేయచ్చు.కానీ ఇంతకు ముందు ఇలా కాదు.
చాల పెద్ద సినిమాలు కూడా ఎదో ఒక చిన్న బిట్ అయినా కూడా సెన్సార్ వారు అభ్యంతరం చెప్తారు.అసలు ఈ సెన్సార్ వారు ఎందుకు అభ్యంతరం చెప్తారు అంటే ఏ సినిమాలో అయినా కూడా మితిమీరిన శృంగార సన్నివేశాలు లేదా అతి హింస లాంటివి, వల్గర్ బాషా వంటి కొన్ని విషయాలు సమాజం పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అందుకే సెన్సార్ చేయకుండా సినిమా థియేటర్ కి వెళ్ళదు.
![Telugu Abhishekam, Censor Clean, Laila, Tollywood, Ugadi, Yamaleela-Latest News Telugu Abhishekam, Censor Clean, Laila, Tollywood, Ugadi, Yamaleela-Latest News]( https://telugustop.com/wp-content/uploads/2022/12/sv-krishna-reddy-44-movies-censor-clean-yamaleela-movie.jpg)
ఇక సినిమాలో ఉండే హింస లేదా శృంగారం మోతాదు బట్టి సదరు బోర్డు ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు.A, B అంటూ సినిమాకు ఒక సర్టికేట్ వస్తుంది.అది సినిమా వేయడానికి ముందు వారికి వచ్చిన సర్టిఫికెట్ కూడా వేయాలి.
అయితే సెన్సార్ వాళ్ల చేతికి వెళ్ళాక ఒక్క సీన్ కూడా లేదా ఒక డైలాగ్ కూడా కట్ అవ్వకుండా సినిమా బయటకు రావడం అసాధ్యం.కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44 సినిమాలు సెన్సార్ వారి చేత క్లీన్ అవుట్ గా వచ్చిన దర్శకుడు మన తెలుగు లోనే ఉన్నారు.
అయన మరెవరో కాదు ఎస్ వి కృష్ణ రెడ్డి.ఆయన తీసిన 44 సినిమాలు సెన్సార్ ఒక్క కట్ కూడా చేయలేదు.ఇది ఒక రికార్డు అని కూడా చెప్పచ్చు.