1.కాంగ్రెస్ పిటిషన్ హైకోర్టులో విచారణ వాయిదా
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/congress-telangana-high-court.jpg )
కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి సిబ్బందిని తీసుకువెళ్లడంపై తెలంగాణ హైకోర్టు లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.గురువారం ఉదయం కాంగ్రెస్ పిటిషన్ పై హైకోర్టు విచారించింది.తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
2.కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం
కేరళ రాష్ట్రంలో బర్డ్ ప్లూ కలకలం రేపుతోంది.కొట్టాయం జిల్లాలోని అర్బుకర , తలయాజమ్ గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది.
3.హైదరాబాద్ ఐ ఎస్ బి ఆవిర్భావ వేడుకలకు చంద్రబాబు
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/chandrababu-isb-formation-day.jpg )
ఐ ఎస్ బి హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుక లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ వేడుకలు జరగనున్నాయి.
4.పేదవాడలో కాపు నేతల భేటీ
బెజవాడలో కాపు నేతల భేటీ ఆసక్తి రేపుతోంది.మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ , బోండా ఉమ , ఎడం బాలాజీ సమావేశం అయ్యారు.
5.సినీ నటుడు సోను సూద్ కు రైల్వే పోలీసుల వార్నింగ్
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/sonusood-railway-police-warning.jpg )
బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సోను సూద్ కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.కదులుతున్న రైల్ లో ఫుడ్ బోర్డ్ పై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో వైరల్ కావడం పై రైల్వే పోలీసులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.
6.విశాఖలో అయ్యప్ప స్వాముల ఆందోళన
విశాఖలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.47 మంది స్వాముల బృందం ఆగస్టులో కొల్లాపూర్ రైలుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు.అయితే ప్రయాణ సమయంలో ఆ బోగీలు లేకపోవడంతో ఆ విషయాన్ని స్వాములు రైల్వే శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు.అయినా రైల్వే శాఖ పట్టించుకోకపోవడంతో స్వాములు ఆందోళనకు దిగారు.దీంతో అదనపు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.
7.కడప ఒంగోలుకు నాన్ ఏసి స్లీపర్ సర్వీసులు
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/kadapa-ongole-non-ac-sleeper-buses.jpg )
హైదరాబాద్ నుంచి కడప ఒంగోలుకు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు.
8.ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షలు విరమణలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవాని దీక్షల విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
9.బండి సంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/bandi-sanjay-congress-felxis.jpg )
కరీంనగర్ జిల్లాలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీగా కరీంనగర్ కు ఏం చేశావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి.
10.సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు
సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి పిసిసి చీఫ్ గిడుగు రుద్ర రాజు వచ్చారు.ఆయనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వాగతం పలికారు.
11.కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/bonda-umamaheshwara-rao.jpg )
కాపులు వైసిపిని నమ్మే పరిస్థితి లేదని టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
12.బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ ఈరోజు జరగనుంది.ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
13.షారుక్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/sharukh-khan-pathaan-issue.jpg )
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠన్ ‘ సినిమాకు నిరసన సెగ తగులుతోంది.హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందని ఆరోపిస్తూ కొన్ని హిందూ సంఘాలు ఇండోర్ నగరంలో షారుక్ ఖాన్ కు వ్యతిరేకంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
14.కడపకు రానున్న రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తిరుపతి నుంచి కడపకు రానున్నారు .అమీన్ బీర్ దర్గాను ఆయన దర్శించుకోనున్నారు.
15.గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/tribal-students-national-sports.jpg )
గుంటూరులో ఈనెల 17 నుంచి 22 వరకు నగరంలో గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు జరగనున్నాయి.
16.జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
ఈనెల 18న సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర జరగనుంది.ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారు.
17.ఈశ్వరి దేవి ఆరాధనోత్సవాలు
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/kadapa-eeshwari-devi-temple.jpg )
కడపలో నేటి నుంచి బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరి దేవి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి.
18.విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
భవాని దీక్షల సందర్భంగా విజయవాడ నగరంలో ఈనెల 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.ప్రకాశం బ్యారేజ్ మీద వాహనాలకు అనుమతిని రద్దు చేశారు.
19.ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
![Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala Telugu Apcm, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Cpi Ramakrishna, Kerala](https://telugustop.com/wp-content/uploads/2022/12/apsrtc-good-news.jpg )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయించింది .ఈ సమయంలో ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,990 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,530
.