న్యూస్ రౌండప్ టాప్ 20
TeluguStop.com
H3 Class=subheader-style1.కాంగ్రెస్ పిటిషన్ హైకోర్టులో విచారణ వాయిదా/h3p """/"/
కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి సిబ్బందిని తీసుకువెళ్లడంపై తెలంగాణ హైకోర్టు లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.
గురువారం ఉదయం కాంగ్రెస్ పిటిషన్ పై హైకోర్టు విచారించింది.తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
H3 Class=subheader-style2.కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం/h3p
కేరళ రాష్ట్రంలో బర్డ్ ప్లూ కలకలం రేపుతోంది.
కొట్టాయం జిల్లాలోని అర్బుకర , తలయాజమ్ గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది.
H3 Class=subheader-style3.హైదరాబాద్ ఐ ఎస్ బి ఆవిర్భావ వేడుకలకు చంద్రబాబు/h3p
"""/"/
ఐ ఎస్ బి హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుక లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ వేడుకలు జరగనున్నాయి.
H3 Class=subheader-style4.
పేదవాడలో కాపు నేతల భేటీ/h3p
బెజవాడలో కాపు నేతల భేటీ ఆసక్తి రేపుతోంది.మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ , బోండా ఉమ , ఎడం బాలాజీ సమావేశం అయ్యారు.
H3 Class=subheader-style5.సినీ నటుడు సోను సూద్ కు రైల్వే పోలీసుల వార్నింగ్/h3p
"""/"/
బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సోను సూద్ కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
కదులుతున్న రైల్ లో ఫుడ్ బోర్డ్ పై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ కావడం పై రైల్వే పోలీసులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.
H3 Class=subheader-style6.విశాఖలో అయ్యప్ప స్వాముల ఆందోళన/h3p
విశాఖలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.
47 మంది స్వాముల బృందం ఆగస్టులో కొల్లాపూర్ రైలుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు.
అయితే ప్రయాణ సమయంలో ఆ బోగీలు లేకపోవడంతో ఆ విషయాన్ని స్వాములు రైల్వే శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు.
అయినా రైల్వే శాఖ పట్టించుకోకపోవడంతో స్వాములు ఆందోళనకు దిగారు.దీంతో అదనపు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తామని రైల్వే శాఖ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు.
H3 Class=subheader-style7.కడప ఒంగోలుకు నాన్ ఏసి స్లీపర్ సర్వీసులు/h3p
"""/"/
హైదరాబాద్ నుంచి కడప ఒంగోలుకు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు.
H3 Class=subheader-style8.ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షలు విరమణలు/h3p
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవాని దీక్షల విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
H3 Class=subheader-style9.బండి సంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు/h3p
"""/"/
కరీంనగర్ జిల్లాలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు వ్యతిరేకంగా తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీగా కరీంనగర్ కు ఏం చేశావంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీతో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి.
H3 Class=subheader-style10.సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు/h3p
సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి పిసిసి చీఫ్ గిడుగు రుద్ర రాజు వచ్చారు.
ఆయనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్వాగతం పలికారు.
H3 Class=subheader-style11.
కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు/h3p
"""/"/
కాపులు వైసిపిని నమ్మే పరిస్థితి లేదని టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
H3 Class=subheader-style12.బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ/h3p
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ ఈరోజు జరగనుంది.
ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
H3 Class=subheader-style13.
షారుక్ ఖాన్ దిష్టిబొమ్మ దహనం/h3p
"""/"/
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'పఠన్ ' సినిమాకు నిరసన సెగ తగులుతోంది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందని ఆరోపిస్తూ కొన్ని హిందూ సంఘాలు ఇండోర్ నగరంలో షారుక్ ఖాన్ కు వ్యతిరేకంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
H3 Class=subheader-style14.కడపకు రానున్న రజినీకాంత్/h3p
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తిరుపతి నుంచి కడపకు రానున్నారు .
అమీన్ బీర్ దర్గాను ఆయన దర్శించుకోనున్నారు.
H3 Class=subheader-style15.
గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు/h3p
"""/"/
గుంటూరులో ఈనెల 17 నుంచి 22 వరకు నగరంలో గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు జరగనున్నాయి.
H3 Class=subheader-style16.జనసేన కౌలు రైతు భరోసా యాత్ర/h3p
ఈనెల 18న సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర జరగనుంది.
ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారు.
H3 Class=subheader-style17.
ఈశ్వరి దేవి ఆరాధనోత్సవాలు/h3p
"""/"/
కడపలో నేటి నుంచి బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరి దేవి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయి.
H3 Class=subheader-style18.విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు/h3p
భవాని దీక్షల సందర్భంగా విజయవాడ నగరంలో ఈనెల 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
ప్రకాశం బ్యారేజ్ మీద వాహనాలకు అనుమతిని రద్దు చేశారు.
H3 Class=subheader-style19.
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్/h3p
"""/"/
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయించింది .
ఈ సమయంలో ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
H3 Class=subheader-style20.
ఈరోజు బంగారం ధరలు/h3p
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,990
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,530.
చనిపోయిన పిల్ల ఏనుగు.. తల్లి ఏనుగు ఏం చేస్తుందో చూస్తే కన్నీళ్లాగవు..