25 మంది భారతీయ విద్యార్ధులకు క్వాడ్ ఫెలోషిప్ ...!!

క్వాడ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద 25 మంది భారతీయ విద్యార్ధులకు అమెరికా అవకాశం కల్పించింది.క్వాడ్‌లోని నాలుగు సభ్యదేశాల (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ , భారత్) నుంచి అమెరికా 100 మంది విద్యార్ధులను ఎంపిక చేసింది.

 Us Takes 25 Students From India Under Inaugural Quad Fellowship,quad Fellowship,-TeluguStop.com

వీరిలో భారత్ నుంచి 25 మందికి చోటు దక్కింది.ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేకే సులివాన్.

క్వాడ్ తొలి ఫెలోస్ బృందానికి ఎంపికైన విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఏడాది మేలో క్వాడ్ దేశాధినేతలు ‘‘క్వాడ్ ఫెలోషిప్’’ను ప్రారంభించారు.

దీనిని నాలుగు సభ్య దేశాలకు చెందిన తర్వాతి తరం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి రూపొందించారు.ఆస్ట్రేలియా, ఇండియా, జ‌పాన్‌, అమెరికా విద్యార్థులు యూఎస్‌లో చదువుకునేందుకు వీలుగా ‘క్వాడ్ ఫెలోషిప్’ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.

అయితే ఈ నాలుగు దేశాల‌కు చెందిన కేవలం వంద మంది విద్యార్థుల‌కు మాత్రమే ఇందులో అవకాశం కల్పిస్తారు.
గ్రాడ్యుయేట్‌, డాక్ట‌రేట్ ప్రోగ్రామ్‌ల‌కు గాను సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్ విభాగాల్లో ఈ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు.18 ఏళ్లు నిండిన అమెరికా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, ఇండియా నివాసితులు దీనికి అర్హులు.బ్యాచిల‌ర్స్ డిగ్రీ లేదా 2023 ఆగ‌స్టు నాటికి సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ రంగాల్లో తత్సమాన విద్యార్హ‌త ఉండాలి.

అండ‌ర్‌ గ్రాడ్యుయేట్ స్థాయిలో అకడ‌మిక్స్‌లో మంచి మెరిట్ సాధించి ఉండాలి.మాస్ట‌ర్స్ లేదా పీహెచ్‌డీ చేస్తున్న వాళ్లు కూడా ద‌ర‌ఖాస్తుకు అర్హులే.ఆగ‌స్టు 2023లో ఫెల్లోషిప్ ప్రోగ్రామ్ … 2024 వేసవిలో సీనియ‌ర్ ఫెల్లో‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది.

క్వాడ్ ఎలా ఏర్పాటైంది:

Telugu Australia, India, Japan, Quad, Quad Fellowship-Telugu NRI

2004లో హిందూ మహా సముద్రం తీరంలోని దేశాలను వణికించిన సునామీ అనంతరం .బాధిత దేశాలకు సాయం చేయడానికి భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి .2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అంబే ‘‘క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ’’ లేదా ‘‘క్వాడ్’’గా ఈ కూటమికి పేరు పెట్టారు.అయితే అనుకోని కారణాల వల్ల ఈ కూటమి ముందుకు వెళ్లలేదు.2017లో క్వాడ్ గ్రూప్ తిరిగి యాక్టివ్ అయ్యింది.2021లో క్వాడ్ దేశాల అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు.అయితే ఈ కూటమిలో చేరడానికి దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube