దీప్తి సునైనా. ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
సోషల్ మీడియా స్టార్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునయన.ఇప్పటివరకు వెండితెరపై అడుగుపెట్టనేలేదు కానీ తెలుగు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం మాత్రం సంపాదించుకుంది.
తొలిసారిగా దీప్తి సునైనా. డబ్స్మాష్, టిక్ టాక్ వీడియోలతో పరిచయమైంది.
తన డైలాగ్స్ వీడియోస్ తో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేసింది.డైలాగ్స్ తగ్గట్టుగా లిప్ మూమెంట్ ఇస్తూ అందరి దృష్టిలో పడటంతో ఆమె వీడియోలకు బాగా అలవాటు పడ్డారు నెటిజన్స్.
దీంతో ఆమెది ఏ వీడియో వచ్చినా క్షణాల్లో వైరల్ అయ్యేది.
అలా ఈమెకు మంచి ఫాలోయింగ్ దొరికింది.
తర్వాత యూట్యూబుల్లో పలు వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.అంతేకాకుండా కవర్ సాంగ్స్ కూడా బాగా చేసేది.
దీంతో ఇక్కడ కూడా ఈమెకు మరింత గుర్తింపు రావడంతో అక్కడ కూడా మంచి అభిమానం సొంతం చేసుకుంది.ఇక ఈ గుర్తింపు లతో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది.
ఇందులో అడుగు పెట్టాక తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.ఇక అందులో ఉన్నంతకాలం తన ఆటపాటలతో బాగా సందడి చేసింది.
ఇక ఆ సమయంలో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టింది.ఇక అప్పుడే తన నోట నుండి షణ్ముఖ్ అనే పేరు బయటికి వచ్చింది.
ఎప్పుడైతే ఈమె ఆ పేరు బయట పెట్టిందో అప్పటి నుంచి అతడు గురించి తెగ ఎంక్వయిరీ చేశారు నెటిజన్స్.అతడు కూడా యూట్యూబ్ స్టార్ అని అతడు కూడా బాగా వీడియోస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అని తెలిసింది.ఇక అతనితో కలిసి దీప్తి కూడా పలు వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ చేసింది.ఇక వీరిద్దరూ గతంలో లవ్ లో కూడా ఉండేవాళ్లు.ఇక షణ్ముఖ్ తన పరిచయాన్ని బాగా పెంచుకున్న తర్వాత బిగ్బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు.ఆ సమయంలో హౌసులో అతడు చేసిన రచ్చ అందరికీ పూర్తిగా తెలిసింది.
దీంతో అతడికి బ్రేకప్ చెప్పేసి తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది దీప్తి.
ఇక ఈ మధ్య బాగా వర్కౌట్లు చేస్తూ ఆ వీడియోలను తన ఇన్ స్టాలో బాగా పంచుకుంటూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.అందులో ఒక రెండు నెలల్లో ఎవరు ఊహించలేనిది జరగబోతుంది అంటూ షాకింగ్ కామెంట్ చేస్తూ నేను పుట్టాను అంటూ కామెంట్ చేసింది.
అంటే మరో 45 రోజుల్లో ఆమె పుట్టిన రోజు అని దీంతో అది ఎవరు ఊహించలేనిది అంటూ ఏదో రహస్యమైన స్టోరీ ని చెప్పినట్లు పంచుకుంది.ఇక ఆమె పంచుకున్న స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతుంది.