ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలను పాడి ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయా ఘోషల్ తన అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.అదేమిటంటే ఆమె తన గొంతును కోల్పోయినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
కానీ డాక్టర్ల సహాయంతో తాను కోలుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తాను ఎప్పటిలాగే మాట్లాడుతున్నట్లు ఆమె తెలిపింది.
ఇటీవల అమెరికాలోని ఒర్లాండాలో జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్ తర్వాత తన గొంతు రాలేదని కనీసం మాట్లాడేందుకు కూడా వీలు కాలేదని తెలిపింది.కానీ చికిత్స అనంతరం మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుతున్నట్లు ఆమె తెలిపింది.
కదా ఇదే విషయాన్ని శ్రేయా ఘోషల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది.సంగీత ప్రపంచంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఏడు నగరాల్లో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్నారు.
న్యూజెర్సీ, డల్లాస్, వాషింగ్టన్ డీసీ , బే ఏరియా, లాస్ ఏంజిల్స్, ఓర్లాండో మరియు న్యూయార్క్లలో పర్యటన జరిగింది.
నవంబర్ 18న, ఓర్లాండోలోని ఎడిషన్ ఫైనాన్షియల్ ఎరీనాలో శ్రేయా ఘోషల్ ప్రదర్శన ఇచ్చింది.
అయిత ఈ కచేరీ తర్వాత ఆమె తన గొంతును కోల్పోయినట్లు ఆమె ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది.ఇది చాలా భావోద్వగమైన రోజు.నేను నా మ్యూజిక్ యూనిట్.నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను.వారు నా చెడు, మంచి సమయాల్లో నాకు మద్దతు ఇచ్చారు.నాకు అండగా నిలిచారు.
నిన్న రాత్రి ఓర్లాండోలో కచేరీ తర్వాత నేను పూర్తిగా నా స్వరాన్ని కోల్పోయాను.నా శ్రేయోభిలాషుల ఆశీస్సులు ప్రార్ధన.
డా.సమీర్ భార్గవ అందించిన చికిత్సతో నేను నా గాత్రాన్ని తిరిగి పొందాను.ఆ తర్వాత న్యూయార్క్ ఎరీనాలో మొత్తం మూడు గంటల కచేరీలో పాల్గొన్నాను అని ఇన్ స్టా స్టోరీలో తెలిపింది శ్రేయా ఘోషల్.