బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వెండితెరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.బుల్లితెరతో పోల్చి చూస్తే సినిమాలలో నటించడం ద్వారానే అనసూయకు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతోంది.
మరోవైపు స్టార్ హీరోల సినిమాలలో అనసూయకు కీలక పాత్రలు వస్తుండటం వల్ల కూడా యాంకర్ అనసూయ బుల్లితెరకు దూరమయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యాంకర్ అనసూయ జబర్దస్త్ షోకు దూరం కావడం ఆ షో రేటింగ్స్ పై కూడా ప్రభావం చూపుతోంది.
జబర్దస్త్ షోకు కేవలం 3 రేటింగ్ వస్తోందంటే ఆ షో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.అయితే జబర్దస్త్ షోకు రాకముందే అనసూయ పలు సినిమాలలో నటించినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదనే సంగతి తెలిసిందే.
మరోవైపు అనసూయ ఆస్తులు భారీ రేంజ్ లో పెరిగాయని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఆమె ఆస్తులు పాతిక కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయంటే అనసూయ రేంజ్ ఏంటో సులువుగానే అర్థమవుతుంది.
అనసూయకు పుష్ప ది రైజ్ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టగా పుష్ప ది రూల్ అంతకు మించి పేరును తెచ్చిపెడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే అనసూయ అంచనాలకు మించి సక్సెస్ సాధించడం గ్యారంటీ అని మరి కొందరు చెబుతున్నారు.
అనసూయ గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించగా ఈ పాత్రకు సైతం మంచి మార్కులు పడ్డాయి.బుల్లితెరపై అనసూయ రీఎంట్రీ ఇవ్వాలని కొందరు ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.సినిమాల విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నటీమణులలో అనసూయ ఒకరు.కథలను ఎంచుకునే విధానంలో ఇతర యాంకర్లకు అనసూయకు చాలా తేడాలు ఉన్నాయి.అనసూయకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో నెగిటివిటీ కూడా అదే స్థాయిలో ఉంది.