నల్లగొండ జిల్లా:2022 నవంబర్ 3 వ తేదీన జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రానికి ఓటర్లు 12 కార్డులలో ఏదో ఒక దానిని విధిగా ఓటర్ స్లిప్ తో పాటు తీసుకురావాలని,అయితే ఆ గుర్తింపు కార్డులో వివరాలు,ఫోటో స్పష్టంగా ఉండాలని,పోలింగ్ అధికారులు సులభంగా గుర్తించే విధంగా ఉన్న కార్డునే వారికి చూపించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.ఎన్నికల సంఘం ఈనెల అక్టోబర్ 14 నాడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డుగా పోలింగ్ సిబ్బంది పరిగణించరాదని,దానితోపాటు ఫోటో స్పష్టంగా ఉన్న,అక్షర దోషం లేని ఎన్నికల గుర్తింపు కార్డు అయినా ఎపిక్ కార్డును ఖచ్చితంగా ఓటర్ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఆయన కోరారు.
ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డు అందుబాటులో లేకుంటే,1.ఆధార్ కార్డ్, 2.ఉపాధి హామీ జాబ్ కార్డ్,3.ఫోటో ఉన్న బ్యాంక్ పాస్ బుక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాసుబుక్,4.
కార్మిక మంత్రిత్వ శాఖ జారీచేసిన ఫోటో ఆరోగ్య కార్డు,5.డ్రైవింగ్ లైసెన్స్,6.
పాన్ కార్డ్,7.స్మార్ట్ కార్డ్,8.
భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్,9.ఫోటో ఉన్న పెన్షన్ పత్రము,10.
ప్రభుత్వం జారీచేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, 11.ఎంపీ,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులు,12.
కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ జారీచేసిన దివ్యాంగ గుర్తింపు కార్డు వంటి 12 గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించినదని,వీటిలో దేనినైనా ఒకదానిని తమ వెంట పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.పాస్ పోర్ట్ ద్వారా ఓటు హక్కును పొందిన ప్రవాస భారతీయులు మాత్రం ఖచ్చితంగా తమ ఒరిజినల్ పాస్ పోర్ట్ ను మాత్రమే ఓటర్ స్లిప్ తో పాటు పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని ఆయన సూచించారు.