మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికోసం భారీఎత్తున తరలిస్తున్న డబ్బు ఆదివారం రాత్రి పోలీసు తనిఖీలలో పట్టుబడింది.బీజేపీ ఎమ్మెల్యే ఈట ల రాజేందర్‌కు చెందిన జమునా హ్యాచరీస్ నుంచి సుమారు రూ.90 లక్షలను తరలిస్తున్న ట్టు వెల్లడయ్యింది.పోలీసుల కథనం ప్రకారం.
శామీర్‌పేట సమీపంలోని పూడూరులో ఉంటు న్న కడారి శ్రీనివాస్ (28) మూడేండ్లుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.జమునా హ్యాచరీస్ వ్యవహారాలను జనార్దన్ చూస్తుంటాడు.
త్రిపుర కన్‌స్ట్రక్షన్ సంస్థ కార్యాలయానికి వెళ్తే, కొంత డబ్బు ఇస్తారని, దానిని తీసుకొని మునుగోడు వెళ్లాల్సి ఉంటుందని డ్రైవర్ శ్రీనివాస్‌కు జనార్దన్ సూచించాడు.ఇందులో భాగంగా శ్రీనివాస్ ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.82 లోని త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్లాడు.అక్కడ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి నుంచి రూ.89,92,000 నగదు బ్యాగ్ తీసుకున్నాడు.అక్కడినుంచి మహేంద్ర థార్ కారు (టీఎస్ 27 డీ 7777)లో బయలుదేరాడు.
భారతీయ విద్యాభవన్ సమీపంలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు థార్ కారులో తనిఖీలు చేయగా నోట్ల కట్టల బ్యాగ్ బయటడింది.ఈ నగదుకు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో, నగదుతో పాటు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
శ్రీనివాస్‌ను విచారించగా ఈ నగదును ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వద్ద పీఏగా పనిచేస్తున్న జనార్దన్ సూచనల మేరకు తరలిస్తున్నానని, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అందజేయాల్సి ఉన్నదని వెల్లడించాడు.ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.